అనుష్క, కాజల్ తో కుదరక ఈషా రెబ్బా తో చేశారట..!

‘యమ గోల మళ్ళీ మొదలైంది’ ‘ఢమరుకం’ వంటి సోషియో ఫాంటసి చిత్రాలతో ప్రేక్షకుల్ని అలరించిన శ్రీనివాస్ రెడ్డి ఆ తరువాత ‘మామ మంచు అల్లుడు కంచు’ అనే చిత్రాన్ని కూడా తెరకెక్కించాడు. అయితే ఆ చిత్రం యావేరేజ్ గా మాత్రమే నిలిచింది. కొన్ని కామెడీ చిత్రాలతో శ్రీనివాస్ రెడ్డికి మంచి పేరే వచ్చింది. అయితే అవి చేసి మరీ బోర్ కొట్టిందో ఏమో కానీ తరువాత వేరే జోనర్ కు సంబందించిన కథల్ని తెరకెక్కించాలని ప్లాన్ చేసాడు. ఈ క్రామంలో నాగ చైతన్యతో ఓ సినిమా చేయాలని భావించినప్పటికీ అది ఆరంభంలోనే ఆగిపోయింది.

మధ్యలో కాస్త గ్యాప్ తీసుకుని ఇప్పుడు ‘రాగాల 24 గంటల్లో’ అనే చిత్రాన్ని తెరకెక్కించాడు. హారర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో ఈషా రెబ్బా, సత్య దేవ్ ప్రధాన పాత్రలు పోషించారు. తమిళ నటుడు శ్రీరామ్(రోజా పూలు ఫేమ్) కూడా ఓ కీలక పాత్ర పోషించాడు. ఈరోజు (నవంబర్ 22న) విడుదలైన ఈ చిత్రానికి మిశ్రమ స్పందన వస్తుండడం గమనార్హం. అయితే ఈ చిత్రంలో హీరోయిన్ ఈషా రెబ్బా పాత్ర సో సో గానే ఉంది అని చాలా మంది చెబుతున్నారు. నిజానికి ఈపాత్ర కోసం దర్శకుడు అనుష్క, కాజల్ ను కూడా సంప్రదించాడట. కానీ వారు రిజెక్ట్ చేయడంతో ఈషా రెబ్బా ను తీసుకున్నట్టు తెలుస్తుంది. అయితే సినిమా చూసిన ప్రతీ ఒక్కరు అనుష్క, కాజల్ చేసేంతలా ఆ పాత్రలో ఏముంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఏమో వాళ్ళు చేసుంటే ఈ చిత్రానికి మరింత క్రేజ్ వచ్చి స్ట్రాంగ్ ఓపెనింగ్స్ వచ్చేవేమో..!

“జార్జ్ రెడ్డి” సినిమా రివ్యూ & రేటింగ్!
యాక్షన్ సినిమా రివ్యూ & రేటింగ్!
తెనాలి రామకృష్ణ బిఏ బిఎల్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఏడు చేపల కథ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus