చక్రి అమెరికా ఆపిల్.. శేఖర్ చంద్ర ఇండియన్ నారింజ!

ఆయన తీసే సినిమాలు కొన్ని ఆడకపోవచ్చు కానీ.. తీసిన ప్రతి సినిమా వైవిధ్యంగా ఉండేలా జాగ్రత్తపడే అతితక్కువ మంది ఫిలిమ్ మేకర్స్ లో రవిబాబు ఒకరు. ఆయన చాలా తక్కువ బడ్జెట్ లో తెరకెక్కించిన “అవును” లాంటి హారర్ థ్రిల్లర్ సాధించిన కమర్షియల్ సక్సెస్ చాలు ఒక దర్శకుడిగా ఆయన విజన్ ఎలా ఉంటుంది అనేది చెప్పడానికి. తన సినిమాల విషయంలోనే కాదు తన వ్యవహారశైలి విషయంలోనూ చాలా భిన్నత్వాన్ని పాటిస్తాడు రవిబాబు. తన సినిమాలకు ఆడియో ఫంక్షన్లు, ప్రీరిలీజ్ ఈవెంట్లు చేయడానికి ఇష్టపడడు ఆయన. అలా ఎందుకు చేయరు అని అడిగితే.. నాకు ఆ హడావుడి నచ్చదు అని ముక్కుసూటి సమాధానం చెబుతాడు.

ఇలాంటి ముక్కుసూటి సమాధానం ఒకటి ప్రస్తుతం ఫిలిమ్ నగర్లో హల్ చల్ చేస్తోంది. “ఆవిరి” సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మీడియాకి ఇంటర్వ్యూలు ఇచ్చిన రవిబాబు.. తాను ఇప్పటివరకూ వర్క్ చేసిన వాళ్ళలో చక్రి ది బెస్ట్ అని, చక్రిలో మరో ఇళయరాజా కనిపించేవాడని చెప్పుకొచ్చిన రవిబాబుని.. “శేఖర్ చంద్ర” సంగీతం కూడా బాగానే ఉంటుంది కదా అని మరో విలేఖరి అడిగిన ప్రశ్నకు సమాధానంగా.. “చక్రి అమెరికా ఆపిల్ లాంటివాడు.. శేఖర్ చంద్ర ఇండియన్ మార్కెట్ లో దొరికే నారింజ పండు లాంటివాడు. ఇద్దరికీ కంపేర్ చేయడం తప్పు” అని రవిబాబు సమాధానం చెప్పడం చర్చనీయాంశం అయ్యింది. “నువ్విలా” నుంచి రవిబాబు-శేఖర్ చంద్ర కలిసి వర్క్ చేస్తున్నారు. అలాంటి శేఖర్ ను ఇలా డీగ్రేడ్ చేసినట్లుగా మాట్లాడడం చాలామందికి రుచించలేదు.

మీకు మాత్రమే చెప్తా సినిమా రివ్యూ & రేటింగ్!
విజిల్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఖైదీ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus