బిగ్ బాస్ షోలో ఏదైనా జరగచ్చు… ఎప్పుడైనా జరగచ్చు అన్నట్లుగానే ఇప్పుడు వైల్డ్ కార్డ్ ఎంట్రీ పెట్టబోతున్నారనే వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అయితే, ఈ వాల్డ్ కార్డ్ ద్వారా కొత్త పార్టిసిపెంట్ ని పంపించే బదులుగా ఎలిమినేట్ అయిపోయినవాళ్లని తిరిగి హౌస్ లోకి పంపిస్తారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. నిజానికి సింగర్ మంగ్లీని 8వ వారం లేదా 9వ వారం వైల్డ్ కార్డ్ ఎంట్రీగా హౌస్ లోకి పంపిద్దామని అనుకున్నారు. కానీ అది కుదరలేదు. అయితే, ఇప్పుడు 11వ వారం లేదా 12వ వారం వైల్డ్ కార్డ్ ఎంట్రీగా హౌస్ మేట్స్ రీ ఎంట్రీ అయితే ఉంటుందనే అంటున్నారు అందరూ.
ఇందులో భాగంగా ఇద్దరి పేర్లు గట్టిగా వినిపిస్తున్నాయి. ఒకరు ఫస్ట్ వీక్ వెళ్లిపోయిన డైరెక్టర్ సూర్యకిరణ్ అయితే, ఇంకొకరు మధ్యలో వెళ్లిపోయిన సుజాతగా చెప్తున్నారు. ఎందుకంటే వీరిద్దరినీ బిగ్ బాస్ టీమ్ సంప్రదించి హౌస్ లో రీఎంట్రీకి రెడీగా ఉండమన్నట్లుగా టాక్ వినిపిస్తోంది.
ఇప్పుడు ఇదే గనక జరిగితే బిగ్ బాస్ సీజన్ 4 షోని మరికొన్ని వారాలు పొడిగించే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే, హౌస్ లోకి వచ్చీ రాంగానే నామిషన్స్ ని తట్టుకుని , అలాగే బయట ఓటింగ్ ని తట్టుకుని ఏ పార్టిసిపెంట్ ఉండాలన్నా కూడా కనీసం నాలుగైదు వారాలు పడుతుంది. కాబట్టి, ఇలా 12వ వారం రీ ఎంట్రీ వస్తే షో ని పొడిగించక తప్పదు. అదీ మేటర్.