Director Ashok: అనుష్క దర్శకుడు ఇప్పుడు సినిమాలు చేస్తున్నాడా.. లేదా?

‘ఉషోదయం’ చిత్రంతో దర్శకుడిగా మారిన జి.అశోక్.. అటు తర్వాత ‘ఆకాశ రామన్న’ అనే సినిమా కూడా తీశాడు. అయితే బ్రేక్ వచ్చింది మాత్రం ‘పిల్ల‌జ‌మిందార్‌’ సినిమాతో..! అటు తర్వాత చేసిన ‘సుకుమారుడు’ ‘చిత్రాంగద’ వంటి సినిమాలు ప్లాప్ అయ్యాయి.అయితే ‘భాగ‌మ‌తి’ చిత్రంతో బ్లాక్ బస్టర్ కొట్టి మళ్లీ ఫామ్లోకి వచ్చాడు. అటు తర్వాత అదే సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వాలని ట్రై చేస్తే.. ఆ సినిమా కాస్త డిజాస్టర్ అయ్యింది.

అతను (Ashok) అనే కాదు తెలుగులో హిట్లు కొట్టిన దర్శకులు అదే సినిమాతో బాలీవుడ్లో ఎంట్రీ ఇస్తే అన్నీ ప్లాప్ అయ్యాయి. ‘దుర్గామతి'(భాగమతి) తో పాటు ‘జెర్సీ’ తో గౌతమ్ తిన్ననూరి, ‘ప్రస్థానం’ తో దేవా కట్టా కూడా ప్లాపులు మూటగట్టుకున్నారు. అయితే ఈ క్రమంలో దీంతో అశోక్ ఏమైపోయాడు అనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. అయితే అతను సైలెంట్ గా ‘ఎస్‌.. బాస్‌’ అనే పేరుతో ఓ సినిమా తీశాడు. హ‌వీష్‌, బ్ర‌హ్మానందం ఇందులో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.

షూటింగ్ కంప్లీట్ అయ్యింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. జూలై నెలలో సినిమాని విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నాడు అశోక్. త్వ‌ర‌లోనే ఫ‌స్ట్ లుక్ ను విడుదల చేయబోతున్నాడు. బ్ర‌హ్మానందం ఈ చిత్రంలో ఫుల్ లెంగ్త్ రోల్ చేసినట్టు తెలుస్తుంది. ‘రంగ‌మార్తాండ‌’ తో మళ్ళీ ఫామ్లోకి వచ్చిన బ్రహ్మి .. ‘ఎస్ బాస్’ తో ఎలా అలరిస్తాడో చూడాలి. ఈ సినిమా కనుక సక్సెస్ అయితే అశోక్ మళ్ళీ ఫామ్లోకి వచ్చినట్టే..!

మేమ్ ఫేమస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సత్తిగాని రెండెకరాలు సినిమా రివ్యూ & రేటింగ్!

మళ్ళీ పెళ్లి సినిమా రివ్యూ & రేటింగ్!
‘డాడీ’ తో పాటు చిరు – శరత్ కుమార్ కలిసి నటించిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus