Sreeleela: ‘దేఖ్‌లేంగే సాలా’.. బాగుంది కానీ.. శ్రీలీల డ్యాన్సెక్కడ మాస్టారూ.. సైడ్‌ చేశారేంటి?

అంటే స్టార్‌ హీరోల ఫ్యాన్స్‌ బాధపడతారు కానీ.. ఓ పాటలో శ్రీలీల ఉంది అంటే.. హీరో కంటే ఆమెకే ఎక్కువ పేరొస్తుంది. స్ప్రింగ్‌లా కదులుతూ ఆమె వేసే డ్యాన్స్‌ అలా ఉంటుంది మరి. ఈ విషయాన్ని బయటకు కొందరు హీరోలు చెప్పారు కూడా. అందుకే ఆమె డ్యాన్స్‌ వేసిన పాట వస్తోంది అంటే.. సగటు సినిమా అభిమానులు, డ్యాన్స్‌ ప్రేమికులు ఆమె స్టెప్పుల కోసం ఎదురుచూస్తారు. ఇప్పుడు ‘దేఖ్‌లేంగే సాలా’ పాట వస్తోంది అనగా.. ఇలానే ఎదురుచూశారు ఫ్యాన్స్‌. కానీ వారందరికీ నిరాశే ఎదురైంది.

Sreeleela

పవన్‌ కల్యాణ్‌ హీరోగా ఆమె ఓ హీరోయిన్‌గా హరీశ్‌ శంకర్‌ తెరకెక్కించిన చిత్రం ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్’. ఈ సినిమాలోని మొదటి పాట ‘దేఖ్‌ లేంగే సాలా..’ను ఇటీవల విడుదల చేశారు. అందులో మునపటి పవన్‌ కల్యాణ్‌ను, అప్పటి గ్రేస్‌ను చూపించే ప్రయత్నం చేశారు. హరీశ్‌ శంకర్‌ డైరక్షన్‌, దినేశ్‌ మాస్టర్‌ కొరియోగ్రఫీలో పవన్‌ భలేగా కనిపించాడు. ఈ క్రమంలో ఆయన పక్కన ఒకట్రెండు స్టెప్పులేసిన శ్రీలీల అస్సలు ప్రేక్షకుల కళ్లకు ఆనలేదు.

ఆమె పక్కన ఉన్నప్పుడు ఎంత పెద్ద హీరో డ్యాన్స్‌ చేసినా ఆమె అప్పీయరెన్స్‌ అదిరిపోతుంది. అయితే ఇలా అవుతుందనో లేక, పవన్‌నే కాన్సట్రేషన్‌ చేయాలనో కానీ.. లిరికల్‌ సాంగ్‌లో ఆమెను పెద్దగా చూపించలేదు. ఒకట్రెండు స్టెప్పులు మాత్రం చూపించారు. లిరికల్‌ సాంగ్‌లో మాత్రమేనా? లేక పాట అంతా అలానే ఉంటుందా అనేది సినిమా వస్తే కానీ తెలియదు. ఇప్పటివరకు అయితే ఫ్యాన్స్‌ నాట్‌ హ్యాపీ. కానీ పవన్‌ ఫ్యాన్స్‌ హ్యాపీ.

ఆమెను మరికాస్త పాటలో చూపించి ఉంటే.. పాట ఇంకా అదిరిపోయేది అని చెప్పొచ్చు. అయితే లిరికల్‌ సాంగ్‌లోనే అంతా ఎందుకు అనుకున్నారేమో.. ఆమెను చూపించలేదు. అయితే ఈ సినిమా శ్రీలీలకు తెలుగులో చాలా కీలకం. వరుస సినిమా పరాజయాలు పాలైన నేపథ్యంలో ఆమెకు ఈ సినిమా హిట్‌ కావాలి. మరి ‘గబ్బర్‌ సింగ్‌’ సినిమాలో శ్రుతి హాసన్‌కి హిట్‌ ఇచ్చినట్లు.. పవన్‌ ఈ సినిమాతో లీలకు హిట్టిస్తారేమో చూడాలి..

సీనియర్ నటుడిని హతమార్చిన సొంత కొడుకు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus