సినీ పరిశ్రమలో విషాదాల సంఖ్య అంతకంతకు పెరుగుతూనే ఉంది. నిత్యం ఏదో ఒక బ్యాడ్ న్యూస్ వింటూనే ఉన్నాం. ఈ ఏడాది అప్పుడే కోటా శ్రీనివాసరావు, కీరవాణి తండ్రి శివశక్తి దత్తా వంటి దిగ్గజాలను కోల్పోయాం. ఇంకా చాలా మంది అనారోగ్య సమస్యలతో, ప్రమాదవశాత్తు ఇలా మృత్యువాత పడ్డారు.తాజాగా మరో బ్యాడ్ న్యూస్ వినాల్సి వచ్చింది.
వివరాల్లోకి వెళితే… ప్రముఖ హాలీవుడ్ నటుడు అయినటువంటి రాబ్ రైనర్ మృతి చెందారు. ఆయన వయసు 78 ఏళ్ళు. కొన్నాళ్లుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ వస్తున్న ఆయన అనుమానాస్పద స్థితిలో చచ్చిపడి ఉన్నాడు. దారుణం ఏంటంటే అతనితో పాటు తన భార్య మిచెల్ సింగర్ రైనర్ కూడా మృతి చెందడం. ఆమె వయసు 68 ఏళ్ళు. ఈ ఇద్దరి మరణాల గురించి దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఓ షాకింగ్ నిజం తెలుసుకున్నారు.
వీరి సొంత కొడుకు నిక్ రైనర్ ఇతన్ని హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. వెంటనే అతడిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టినట్టు కూడా తెలుస్తుంది. కొన్నాళ్లుగా నిక్ డ్రగ్స్‌కు బానిసైపోయాడట. తల్లిదండ్రులు అతన్ని మందలించినా అతను వారి మాట వినకుండా కోపాన్ని పెంచుకున్నట్టు తెలుస్తుంది. ఈ క్రమంలో పేరెంట్స్ కి దూరంగా గెస్ట్‌హౌజ్‌లో ఉంటూ వచ్చాడట.
అయితే ఇటీవల అతను పాల్గొన్న హాలిడే పార్టీలో తండ్రి రాబ్‌తో గొడవపడినట్లు బంధుమిత్రులు తెలిపారు. కోపంతో రగిలిపోయి డ్రగ్స్ మత్తులో రాబ్ ని,రైనర్ ని అతను కిరాతకంగా చంపినట్టు స్పష్టమవుతుంది. ఈ ఘటన యావత్ హాలీవుడ్ ని కుదిపేసింది అని చెప్పాలి.