బిగ్ బాస్ హౌస్ లో ప్రతివారం వరెస్ట్ పెర్ఫామర్ ఎవరు అనేదానిపైన హౌస్ మేట్స్ అందరూ కలిసి ఏకాభిప్రాయనికి రావాలి. అలా హౌస్ మేట్స్ చెప్పిన పేరుని జైల్లో పెట్టడం అనేది రెండు మూడు వారాలుగా బిగ్ బాస్ చేస్తున్నాడు. మొదటివారంలో జెస్సీ, రెండోవారంలో సన్నీ, మూడోవారంలో వరెస్ట్ పెర్ఫామర్ ఎవరు అని అడినపుడు అందరూ తలా ఒక పేరు చెప్పారు. ముందుగా జెస్సీ హమీదా పేరు చెప్పాడు. ఆతర్వాత మానస్ లేచి తనపేరు తాను చెప్పుకున్నాడు.
సెల్ఫ్ నామినేట్ అయ్యాడు. ఈవారం తన పెర్ఫామన్స్ తనకే శాటిస్ ఫ్యాక్షన్ లేదని, అందుకే నన్ను నేను నామినేట్ చేస్కుంటున్నా అంటూ చెప్పాడు. దీనికి ఇంటి కెప్టెన్ అయిన జెస్సీ ఒప్పుకోలేదు. దీంతో మానస్ జెస్సీ పేరు చెప్పాడు. ఇక దొరికిందే ఛాన్స్ అనుకున్న హౌస్ మేట్స్ అందరూ కూడా మానస్ పేరు చెప్పుకొచ్చారు. షణ్ముక్, హమీద, సిరి, కాజల్, నటరాజ్ మాస్టర్, సన్నీ, రవి , శ్రీరామ్ ఇలా అందరూ మానస్ పేరు మెజారిటీగా చెప్పారు.
ముఖ్యంగా రవి నిన్ను నువ్వు సెల్ఫ్ నామినేట్ చేస్కుని వరెస్ట్ అని చెప్పుకోవడం నాకు నచ్చలేదంటూ రీజన్ చెప్పి నామినేట్ చేశాడు. దీంతో మానస్ జైల్ కి వెళ్లాల్సి వచ్చింది. ఇక ఈవారం ఓవర్ ఆల్ గా పెర్ఫామన్స్ చూసినట్లయితే, జెస్సీ – సన్నీ – రవి – షణ్ముక్ లు తమ గేమ్ ని బాగా ఆడారని బెస్ట్ పెర్ఫామర్స్ వాళ్లే అని అంటున్నారు నెటిజన్స్. ముఖ్యంగా జెస్సీ గేమ్ లో ఇంప్రూమెంట్ కనిపించిందని అందుకే ఇంటి కెప్టెన్ కూడా అయ్యాడని చెప్తున్నారు.