గత రెండు రోజుల్లో అనేకమంది నోటి నుంచి వచ్చిన ప్రశ్న ఇది. కింగ్ నాగార్జున, అమలల తనయుడు అఖిల్ మనసును గెలుచుకున్న అమ్మాయి గురించి తెలుసుకోవాలని చాలా మంది ఆశ పడ్డారు. శోధించారు. శ్రీయా భూపాల్ పాస్ట్ అండ్ ప్రజంట్ ఏమిటో తెలుసుకున్నారు. నగరానికి చెందిన ప్రముఖ వ్యాపార వేత్త షాలిని భూపాల్ కుమార్తె శ్రీయా.
ఈమె న్యూయార్క్ లో ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు చేశారు. రెండేళ్ల క్రితం ‘శ్రీయా సమ్’ లేబుల్ కలక్షన్ ‘ఎబ్ అండ్ ఫ్లో’ని ప్రారంభించారు. శ్రీయాకి ఫ్యాషన్ ప్రపంచంలో మంచి పేరుంది. శ్రియ, కాజల్ అగర్వాల్, సమంత, రకుల్ ప్రీత్సింగ్లతో పాటు బాలీవుడ్ కథానాయికలు ఆలియా భట్, శ్రద్ధాకపూర్.. ఇలా చాలామంది సినీ తారలకు కాస్ట్యూమ్స్ డిజైన్ చేసారు. కొన్నేళ్ళక్రితం వ్యాపార పరంగా కలిసిన అక్కినేని, భూపాల్ కుటుంబ సభ్యుల మధ్య ఇప్పటికీ మంచి స్నేహం కొనసాగుతూ ఉంది.
ఈ విధంగానే అఖిల్, శ్రీయా స్నేహితులయ్యారు. ఆ స్నేహం ప్రేమగా చిగురించింది. వీరి ప్రేమపై నాగార్జున సానుకూలంగానే స్పందించారు. నాగ చైతన్య పెళ్లి తర్వాతనే అఖిల్ గురించి ఆలోచిస్తానని ఓ ఇంటర్వ్యూ లో చెప్పారు. సో అన్న ప్రేమ మాదిరిగానే తమ్ముడి ప్రేమ కథ కూడా పెళ్లి వరకు వెళ్లేలా ఉంది.