Shankar: గేమ్ ఛేంజర్ కంటే ముందు.. శంకర్ ను రిజెక్ట్ చేసిందెవరు?

సౌత్ ఇండియాలో శంకర్ (Shankar) క్రియేట్ చేసిన వండర్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒకప్పుడు పాన్ ఇండియా ట్రెండ్ ను స్టార్ట్ చేసింది ఆయనే. రజినీకాంత్ (Rajinikanth) తో “రోబో,” (Robo) కమల్ హాసన్ తో (Kamal Haasan) “భారతీయుడు” వంటి చిత్రాలతో శంకర్ నేషనల్ వైడ్ స్థాయిలో పేరు తెచ్చుకున్నారు. అయితే, గత కొన్ని సంవత్సరాలుగా శంకర్ సినిమాలకు హైప్ తగ్గిపోయినట్లు అనిపిస్తోంది. “ఐ” సినిమా నుంచి ఆయన గ్రాఫ్ తక్కువవుతోంది. “2.ఓ” (Robo 2.0) యావరేజ్ రిజల్ట్ అందుకోగా, “ఇండియన్ 2”  (Bharateeyudu 2)  సి పెద్దగా ఆకట్టుకోలేకపోయింది.

Shankar

ఇటీవల శంకర్ రామ్ చరణ్ తో (Ram Charan) “గేమ్ ఛేంజర్” (Game Changer)  అనే భారీ ప్రాజెక్ట్ పై దృష్టి పెట్టారు. ఈ సినిమా ద్వారా శంకర్ తన ఫాంలోకి తిరిగి రావాలని భావిస్తున్నారు. గ్లోబల్ స్టార్ చరణ్ తో కలిసి భారీ బడ్జెట్ సినిమా చేయడం శంకర్ దృష్టిలో పెద్ద అవకాశమే. ఈ నేపథ్యంలో ప్రమోషన్ లో భాగంగా శంకర్ తన కెరీర్ లో చేయాలని అనుకున్న కొన్ని ప్రాజెక్టుల గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. శంకర్ మాట్లాడుతూ, తాను చిరంజీవి (Chiranjeevi) , మహేష్ బాబు (Mahesh Babu), ప్రభాస్ (Prabhas)  లాంటి స్టార్ హీరోలతో పనిచేయాలని ఆశించినా అవి సెట్ కాలేదని తెలిపారు.

చిరంజీవితో ప్రాజెక్ట్ ఎందుకు జరగలేదో స్పష్టత ఇవ్వలేదు. అయితే మహేష్ బాబుతో “3 ఇడియట్స్” (3 Idiots) రీమేక్ చేయాలని అనుకున్నట్లు అప్పట్లో టాక్ ఉండేది. కానీ ఆ ప్రాజెక్ట్ ముందుకు కదలలేదు. ప్రభాస్ గురించి కూడా శంకర్ ప్రస్తావించారు, కానీ ఆ ప్రాజెక్ట్ కూడా ఎందుకు సెట్ కాలేదో వివరించలేదు. ఇందువల్ల, మహేష్ బాబు, ప్రభాస్ శంకర్ కథలను రిజెక్ట్ చేశారా? లేదా కథలే పర్ఫెక్ట్ గా అనిపించలేదా? అనేది ఆసక్తికరంగా మారింది.

అప్పట్లో శంకర్ సినిమాలు పక్కా బ్లాక్‌బస్టర్ హిట్‌గా ఉండేవి. అయితే, ప్రతీ స్టార్ హీరోకీ తమ ఇమేజ్‌కు తగిన కథలే కావాలి. ఇది ఒక కారణమై ఉండొచ్చని సినీ వర్గాలు భావిస్తున్నాయి. ఇదిలా ఉండగా, రామ్ చరణ్ మాత్రం “గేమ్ ఛేంజర్” కోసం శంకర్ ఇచ్చిన కథకు వెంటనే ఒప్పుకున్నారు. ఈ ప్రాజెక్ట్ పై భారీ అంచనాలు ఉన్నాయి. భవిష్యత్తులో మహేష్ బాబు, ప్రభాస్ లేదా చిరంజీవి వంటి స్టార్లతో శంకర్ ప్రాజెక్ట్స్ ఉంటాయేమో చూడాలి.

వాయిస్ ఓవర్..తోనే బాక్సాఫీస్ వద్ద దంచి కొట్టిన మహేష్ బాబు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus