2019లో విడుదలైన ‘ది లయన్ కింగ్’ సినిమా ఇండియా వైడ్ బాక్సాఫీస్ ను షేక్ చేసిన సంగతి తెలిసిందే. అందులో ‘సింబా’ పాత్రకి నాని డబ్బింగ్ చెప్పడం వల్ల తెలుగు రాష్ట్రాల్లోని ప్రేక్షకులకి దగ్గరైంది. ఇక దీనికి ప్రీక్వెల్ గా ‘ముఫాసా’ రూపొందిన సంగతి తెలిసిందే. ఈసారి ‘ముఫాసా’ పాత్రకి మహేష్ బాబు (Mahesh Babu) డబ్బింగ్ చెప్పడంతో దీనికి డిమాండ్ బాగా పెరిగింది. డిసెంబర్ 20 న భారీ పోటీలో రిలీజ్ అయిన ‘ముఫాసా’ (Mufasa The Lion King ) కి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభించింది.
దీంతో ఓపెనింగ్స్ కూడా బాగా వచ్చాయి. ముఖ్యంగా తెలుగు వెర్షన్ కి మంచి ఓపెనింగ్స్ రావడం విశేషంగా చెప్పుకోవాలి. ఒకసారి (Mufasa The Lion King) ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ ని గమనిస్తే :
నైజాం | 0.12 cr |
సీడెడ్ | 0.05 cr |
ఆంధ్ర(టోటల్) | 0.10 cr |
ఏపీ + తెలంగాణ(టోటల్) | 0.27 cr |
‘ముఫాసా’ చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో అన్ని వెర్షన్లు కలుపుకుని రూ.2.5 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. బ్రేక్ ఈవెన్ కోసం రూ.3 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. అయితే మొదటి వీకెండ్ కేవలం తెలుగు వెర్షన్ కే ఈ సినిమా రూ.2.45 కోట్ల షేర్ ను రాబట్టింది. అన్ని వెర్షన్లు కలుపుకుని రూ.2.95 కోట్ల వరకు షేర్ వచ్చినట్టు వినికిడి. అంటే బ్రేక్ ఈవెన్ కంప్లీట్ అయిపోయినట్టే..! తెలుగు వెర్షన్ కి మహేష్ బాబు వాయిస్ ఓవర్ ఇవ్వడం వల్లనే ఇది సాధ్యమైంది అని చెప్పాలి. ఓవర్సీస్ లో తెలుగు వెర్షన్ ను మరో 2 రోజుల్లో విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి.