బిగ్ బాస్ హౌస్ లో 11వ వారం అయ్యే ఎలిమినేషన్ అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఒక్కోరోజు ఒక్కో హౌస్ మేట్ గ్రాఫ్ అనేది పూర్తిగా మారిపోతోంది. ఈవారం నామినేషన్స్ లో మొత్తం ఆరుగురు ఉన్నారు. అభిజిత్, హారిక, సోహైల్, మోనాల్, అరియానా, లాస్య. అన్ అఫీషియల్ పోలింగ్ ప్రకారం చూసినట్లయితే చాలా సైట్స్ లో డేంజర్ జోన్ లో మాత్రం ముఖ్యంగా ముగ్గురు కనిపిస్తున్నారు.
ఎప్పటిలాగానే అభిజిత్ టాప్ ప్లేస్ లో ఉంటే, హారిక , ఇంకా సోహైల్ లూ సేఫ్ జోన్ లోనే ఉన్నారు. డేంజర్ జోన్ లో మాత్రం మోనాల్, అరియానా ఇంకా లాస్యలు ఉన్నారు. నిజానికి లాస్య లాస్ట్ వీక్ నామినేషన్స్ లో లేదు. అందుకే ఓటింగ్ పర్సెంటేజ్ అనేది బాగా తగ్గింది. అంతేకాదు, శుక్రవారం లాస్యకి ఫ్యామిలీ మెంబర్స్ రావడం, తన కొడుకు జున్ను రావడం గనక ప్లస్ అయితే ఓటింగ్ పర్సెంటేజ్ పెరుగుతుంది. అప్పుడు ఖచ్చితంగా సేఫ్ జోన్ లోకి వచ్చేస్తుంది.
ఈ లెక్కల ప్రకారం చూస్తే అరియానా ఇంకా మోనాల్ ఇద్దరు మాత్రమే డేంజర్ జోన్ లో ఉంటారు. మరి వీరిద్దరిలో ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేది చాలా ఆసక్తికరంగా మారింది. కొన్ని అన్ అఫీషియల్ సైట్స్ లో పోలింగ్ సైట్స్ లో మనం చూసినట్లయితే అరియానా సేఫ్ జోన్ లోనే కనిపిస్తోంది. కానీ అత్యధికంగా మాత్రం డేంజర్ జోన్ లోనే ఉంది. దీనిని బట్టీ ఒకవేళ అరియనా సేఫ్ జోన్ లో ఉంటుంది అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మోనాల్ ఎలిమినేట్ అవుతుంది.
ఒకవేళ మోనాల్ వల్ల ఇంకా కంటెంట్ వస్తుందు కంటిన్యూ చేద్దాం అని బిగ్ బాస్ టీమ్ నిర్వహకులు భావిస్తే, ఈవారం ఎలిమినేషన్ ఎత్తేస్తారు. మరి చూద్దాం ఏం జరగబోతోంది అనేది.