త్రిషా నిర్ణయం ఆమె నెత్తిన పాలుపోసింది

  • March 14, 2020 / 01:13 PM IST

త్రిషా నిన్న మెగా అభిమానులకు పెద్ద షాక్ ఇచ్చింది. ఆమె చిరంజీవి దర్శకుడు కొరటాల శివతో చేస్తున్న మూవీ నుండి తప్పుకున్నట్లు ప్రకటించింది. సోషల్ మీడియా వేదికగా ఈ విషయంపై స్పష్టత ఇచ్చిన త్రిషా దానికి కారణం కూడా ప్రస్తావించింది. క్రియేటివ్ డిఫరెన్సెస్ కారణంగానే ప్రాజెక్ట్ వదులుకున్నట్లు ఆమె చెప్పడం విశేషం. ఐతే మెగాస్టార్ లాంటి హీరో ఉన్న సినిమాలలో హీరోయిన్స్ కి ఏమంత చెప్పుకోదగ్గ పాత్ర ఉంటుంది. గత కొన్నేళ్లుగా ఆయన సరసన నటిస్తున్న హీరోయిన్స్ కి కథలో ఏమి ప్రాధాన్యం ఉంటుంది.

ఇక ఆమె గతంలో చిరంజీవి స్టాలిన్ సినిమాలో నటించింది, ఆ సినిమాలో ఆమె పాత్ర పాటలకు కొంచెం ఎంటర్టైన్మెంట్ తప్ప మించిన ప్రాధాన్యం ఏమి ఉంది. అసలు నిజం ఏదైనా ఆమె బయటికి వెళ్లిపోయారు. త్రిషా నిర్ణయం కాజల్ కి లక్ తెచ్చిపెట్టినట్లు తెలుస్తుంది. ఈ సినిమాలో హీరోయిన్ గా కాజల్ ని తీసుకోవాలని దాదాపు ఖరారు చేశారని తెలుస్తుంది. టాలీవుడ్ లో అవకాశాలు లేక ఫేడ్ అవుట్ అవుతున్న సమయంలో త్రిషా నిర్ణయం కారణంగా కాజల్ గోల్డెన్ ఛాన్స్ దక్కించుకుంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సివుంది. ఇక ఇప్పటికే కాజల్ చిరంజీవి కమ్ బ్యాక్ మూవీ ఖైదీ 150లో ఆడి పాడింది. రామ్ చరణ్ నిర్మిస్తున్న ఈ సినిమాకు సంగీతం మణిశర్మ అందిస్తున్నారు.

Most Recommended Video

యురేక సినిమా రివ్యూ & రేటింగ్!
మధ సినిమా రివ్యూ & రేటింగ్!
మన టాలీవుడ్ డైరెక్టర్స్ మరియు వారి భార్యలు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus