ఇండియన్ సినిమా (Movies) బాక్సాఫీస్ వద్ద వెయ్యి కోట్ల వసూళ్లు సాధించడం ఇప్పుడు దర్శకులకు ప్రధాన లక్ష్యంగా మారింది. ఈ క్లబ్‌లో ఇప్పటికే తక్కువ మంది మాత్రమే చోటు సంపాదించుకోగలిగారు. రాజమౌళి (S. S. Rajamouli) ‘బాహుబలి 2’ (Baahubali 2) ‘RRR’ (RRR) సినిమాలతో రెండు సార్లు ఈ ఘనత సాధించి ట్రెండ్ సెట్ చేశాడు. తాజాగా, ‘పుష్ప 2: ది రూల్’ తో (Pushpa 2: The Rule) సుకుమార్ (Sukumar) ఈ క్లబ్‌లో చేరగా, నాగ్ అశ్విన్ (Nag Ashwin) ‘కల్కి 2898 AD’ తో (Kalki 2898 AD) ఇదే ఫీట్ అందుకున్నారు.
కేవలం టాలీవుడ్ నుంచే ముగ్గురు దర్శకులు ఈ క్లబ్‌లో చేరడం విశేషం. ఇక బాలీవుడ్ నుంచి నితీష్ తివారీ ‘దంగల్’తో, సిద్దార్థ్ ఆనంద్ (Siddharth Anand) ‘పఠాన్’తో, అట్లీ (Atlee Kumar) ‘జవాన్’తో (Jawan) వెయ్యి కోట్ల మార్క్‌ను దాటారు. కన్నడ నుంచి ప్రశాంత్ నీల్ (Prashanth Neel) ‘KGF చాప్టర్ 2’ (KGF 2) తో ఇండస్ట్రీ హిట్ అందుకున్నారు. అయితే, ఇప్పుడీ క్లబ్‌లో చేరే తదుపరి దర్శకుడు ఎవరో అనేది ఆసక్తికరంగా మారింది. వచ్చే ఏడాది ప్రభాస్‌తో (Prabhas) ‘స్పిరిట్’ (Spirit) తెరకెక్కిస్తున్న సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) ఈ ఫీట్ అందుకోవచ్చని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.
‘యానిమల్’లో (Animal) వసూళ్ల పరంగా ఈ మైలురాయిని చేరుకోకపోయినా, ‘స్పిరిట్’ (Spirit) భారీ అంచనాలతో ఉంది. మరోవైపు, రజనీకాంత్‌తో (Rajinikanth) ‘కూలీ’ (Coolie) చేస్తున్న లోకేష్ కనగరాజ్ (Lokesh Kanagaraj) కూడా ఈ రేసులో ముందుండి ఆ దిశగా సాగుతున్నాడు. తమిళనాడుకు చెందిన గీతూ మోహన్‌దాస్ (Geetu Mohandas) , యశ్‌తో (Yash) ‘టాక్సిక్’ (Toxic)సినిమా (Movies) ప్లాన్ చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ పాన్ ఇండియా స్థాయిలో విడుదలై వెయ్యి కోట్ల కలెక్షన్లు రాబట్టే అవకాశముంది. అదే సమయంలో, ‘కాంతార చాప్టర్ 1’ నార్త్ ఆడియెన్స్‌ను ఆకట్టుకుంటే రిషబ్ శెట్టి (Rishab Shetty) కూడా ఈ క్లబ్‌లో చేరతారని అంటున్నారు.
ఇంకా అల్లు అర్జున్ (Allu Arjun) , త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram) కాంబినేషన్‌లో రాబోయే భారీ ప్రాజెక్ట్ కూడా ఈ లిస్ట్‌లో ప్రథమంగా ఉందని అభిమానులు భావిస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR), హృతిక్ రోషన్ (Hrithik Roshan) నటిస్తున్న ‘వార్ 2’తో అయాన్ ముఖర్జీ, షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan) ‘కింగ్’తో సుజయ్ ఘోష్ ఈ రేసులో ఉన్నారు. మరి నెక్స్ట్ వెయ్యి కోట్లను కొట్టే దర్శకుడిగా ఎవరు టాప్ లో నిలుస్తారో చూడాలి.