టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ రిజల్ట్ తో సంబంధం లేకుండా వరుస సినిమాలను లైన్ లో పెడుతున్నారు. రీసెంట్ గా ఆయన నటించిన ‘రామారావు ఆన్ డ్యూటీ’ అనే సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చింది. కానీ ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఇప్పుడు ‘ధమాకా’ అనే సినిమాతో సందడి చేయబోతున్నారు రవితేజ. డిసెంబర్ లో ఈ సినిమా రిలీజ్ కానుంది. ఇదిలా ఉండగా.. రవితేజ మరో సినిమా కమిట్ అయ్యారు. సినిమాటోగ్రాఫర్ కార్తిక్ ఘట్టమనేని దర్శకుడిగా ఓ సినిమాను తెరకెక్కిస్తున్నారు.
అందులో రవితేజను హీరోగా తీసుకున్నారు. సినిమా స్క్రిప్ట్ వర్క్, ప్రీ ప్రొడక్షన్ వర్క్ మొత్తం పూర్తయింది. కానీ ఇప్పటివరకు సినిమాను మొదలుపెట్టలేదు. దానికి కారణం హీరోయిన్. ఇప్పటివరకు సినిమాకి హీరోయిన్ సెట్ అవ్వలేదట. అనుపమ పరమేశ్వరన్, కృతిశెట్టి, ప్రియా వారియర్, రీతూవర్మ లాంటి వారిని సంప్రదించారట. కొందరికి డేట్స్ అడ్జస్ట్ కాక, మరికొందరు పాత్ర నచ్చక సినిమాను రిజెక్ట్ చేశారు. దీంతో ప్రస్తుతం మేకర్స్ హీరోయిన్ ను వెతికే పనిలో పడ్డారు.
ఒక్కసారి హీరోయిన్ ఫైనల్ అయితే షూటింగ్ షురూ చేయడం ఖాయం. దీనికి ‘ఈగల్’ అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ గా సినిమాను తెరకెక్కించనున్నారు. అందుతున్న సమాచారం ప్రకారం.. 2014లో విడుదలైన హాలీవుడ్ సినిమా ‘జాన్ విక్’కు ఫ్రీమేక్ గా రవితేజ సినిమాను తెరకెక్కిస్తున్నారట.
ఈ సినిమా అఫీషియల్ రీమేక్ రైట్స్ ను అమ్మే ప్రసక్తే లేదు. దీంతో దర్శకుడు కార్తిక్ ఘట్టమనేని తన స్టైల్ లో కథను అడాప్ట్ చేసుకొని సినిమాను తెరకెక్కించబోతున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ ఈ సినిమాను నిర్మించనుంది. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన మరిన్ని విషయాలు తెలియనున్నాయి.