‘ఆర్ఆర్ఆర్’ విజయంతో బాలీవుడ్ ఏమంత ఆనందంగా లేదు అని ఈ మధ్య కాలంలో వార్తలొస్తున్నాయి. ఈ విషయంలో ఎంతవరకు నిజముందో తెలియదు కానీ.. బాలీవుడ్ మీడియా మాత్రం కుళ్లుకుంటోంది అని అర్థమవుతోంది. అయితే ‘ఆర్ఆర్‌ఆర్’ మీద కోపమో లేక ఆలియా భట్ మీద కోపమా అనేది తెలియడం లేదు. గత రెండు రోజులుగా బాలీవుడ్ మీడియాలో చూస్తే.. ఓ వార్త ప్రముఖంగా కనిపిస్తోంది. ‘రాజమౌళిని ఆలియా భట్ సోషల్ మీడియాలో అన్ ఫాలో చేసేసింది’ అనేది ఆ వార్తల సారాంశం.
ఎవరో అంటే, ఎద్దు ఈనింది అన్నట్లుగా ఇంకొన్ని భాషల మీడియాలు కూడా ఈ వార్త రాసేస్తున్నాయి. సోషల్ మీడియాలో వైరల్ అయిపోతోంది. నిజానికి ఆమె అన్‌ఫాలో చేసిందా? అనేది చూడటం లేదు. ఎందుకంటే బాలీవుడ్ ఇంగ్లిష్ మీడియా రాసినప్పుడు నిజమే అయి ఉంటుందని, గుడ్డిగా నమ్మేయడమే కారణం. ఓసారి ఈ విషయమేంటో చూద్దామని ఆమె ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను ఓపెన్ చేసి ఫాలోవర్ల పేర్లు చూస్తే ఆ వార్తలు తప్పని తేలాయి. కారణంగా అందులో రాజమౌళి పేరు ఉండటమే కారణం.
‘ఆర్‌ఆర్‌ఆర్’లో తన పాత్రను చూపించిన విషయంలో ఆలియా చాలా కోపంగా ఉందని, అందుకే తుది విడత ప్రచారానికి కూడా ఆమె రాలేదని తొలుత బాలీవుడ్ మీడియాలో వార్తలొచ్చాయి. ఆ తర్వాత ఈ ఘాటు సరిపోదు అనుకున్నారో ఏమో, ఆలియా తన సోషల్ మీడియాలో రాజమౌళిని అన్ ఫాలో చేసేసిందని రాసేస్తున్నారు. కానీ అక్కడ చూస్తే నిజమ వేరేగా ఉంది. ఆలియా ఫాలో అవుతున్న 475 మందిలో రాజమౌళి, తారక్, రామ్ చరణ్ ముగ్గురూ ఉన్నారు.
ఇంకొంతమంది అయితే ఆలియా తన ఇన్‌స్టాగ్రామ్‌లో ‘ఆర్ఆర్‌ఆర్’ ప్రమోషనల్ కంటెంట్‌ను డిలీట్ చేసేసిందని కూడా రాసుకొచ్చారు. పోస్టర్లు, వీడియోలు, లుక్స్ తీసేసిందని రాశారు. కానీ ఆమె ఖాతాలో చూస్తే ‘ఆర్‌ఆర్‌ఆర్’ పోస్టర్లు, రాజమౌళితో సెట్స్‌లో దిగిన ఫొటోలు అన్నీ ఉన్నాయి. దీంతో ఇదెవరో ‘ఆర్ఆర్ఆర్’ విజయం గిట్టనివారు, ఆలియా అంటే పడనివారు చేసిన పనిలా ఉంది.
Most Recommended Video
‘బాహుబలి’ కి ఉన్న ఈ 10 అడ్వాంటేజ్ లు ‘ఆర్.ఆర్.ఆర్’ కు లేవట..!
‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ గురించి ఈ 11 ఇంట్రెస్టింగ్ విషయాలు మీకు తెలుసా?
‘పుష్ప’ తో పాటు బుల్లితెర పై రికార్డ్ టి.ఆర్.పి లు నమోదు చేసిన 10 సినిమాల లిస్ట్…?