Bigg Boss 5 Telugu: బిగ్‌బాస్‌ మాట వినలేదా… వినిపించుకోవడం లేదా?

బిగ్‌బాస్‌ ఇంట్లో టాస్క్‌లు గురించి వివరించడానికి… ఓ ఫైల్‌ వస్తుంటుంది గమనించారా. చూసే ఉంటారు నల్లగా… స్టైలిష్‌గా ఉంటుంది ఆ ఫైల్‌. మనకు ఇంత బాగా ఆనుతున్న ఫైల్‌… అర్థమవుతున్న అందులోని అంశాలు బిగ్‌ బాస్‌ హౌస్‌మేట్స్‌కి అర్థం కావడం లేదా? అంటే అవుననే అనిపిస్తోంది ఎపిసోడ్లు చూస్తుంటే. ఈ సీజన్‌ను తొలుత నుండి ఫాలో అవుతున్న అందరికీ ఈ విషయం తెలిసిపోతుంది. రీసెంట్‌ టాస్క్‌లో ఇది ఇంకా బాగా కనిపించింది.

‘మిసెస్‌ ప్రభావతి’ పేరుతో కోడి గుడ్ల టాస్క్‌ను బిగ్‌బాస్‌ ఈ వారం పెట్టాడు. కెప్టెన్సీ కంటెండర్‌ టాస్క్‌ ఇది. రూల్స్‌ అన్నీ చెబుతూ… అందులో భాగంగా ఇది ఇండివిడ్యువల్‌ గేమ్‌ అని కూడా చెప్పారు. అంటే ఎవరి ఆట వారు ఆడాలి. కానీ బిగ్‌ బాస్‌ పార్టిసిపెంట్స్‌ ఈ విషయం మరచిపోయినట్లున్నారు. ఇద్దరేసి కలసి ఆడటం సులభంగా కనిపిస్తోంది. రెండోది పట్టుకున్న (కొట్టేసిన?) గుడ్లు బుట్టలోనే ఉంచాలి. కానీ వీటిని ఇంటి సభ్యులు పట్టించుకోలేదు.

గాల్లోంచి పడుతున్న గుడ్లను పట్టుకోవడానికి, ప్రభావతి పెడుతున్న గుడ్లను పట్టుకోవడానికి ముందుకు రాని ప్రియ… మిగిలినవారి బుట్టల్లో గుడ్లను కొట్టేసింది. మరోవైపు తను కొట్టేసిన గుడ్లను మానస్‌కి ఇచ్చేసింది. ఇది ఏ విధంగా ఇండివిడ్యువల్‌ గేమ్‌ అనేది చూడాలి. రెండోది బయట దాచి పెట్టిన గుడ్లను లెక్కించమని ప్రియాంక… కెప్టెన్‌ విశ్వతో గొడవపడింది. ఇవన్నీ చూస్తున్న బిగ్‌బాస్‌ ఇప్పటికి కామ్‌గా ఉన్నాడు. తర్వాతైనా మాట్లాడతారో లేదో చూడాలి.

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

మహా సముద్రం సినిమా రివ్యూ & రేటింగ్!
ఒక్కో సినిమాకు ఈ స్టార్ హీరోలు ఎంతెంత డిమాండ్ చేస్తున్నారో తెలుసా?
టాలీవుడ్ లో బి.టెక్ చదువుకున్న 10 మంది లిస్ట్..!

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus