‘సాహో’ లేటవ్వడానికి కారణాలు అవే?

ఎవ్వరూ ఊహించని విధంగా ప్రభాస్ ఫ్యాన్స్ కు పెద్ద షాక్ తగిలింది. మరో నెల రోజుల్లో తమ అభిమాన హీరో సినిమాని థియేటర్లలో చూస్తున్నామని మొన్నటి వరకూ సోషల్ మీడియాలో పోస్టులు చేస్తూ.. తెగ సంబరపడిపోయారు. అయితే వారి ఆనందానికి బాగా దిష్టి తగిలినట్లుంది. సినిమాని మరో 15 రోజులు వాయిదా వేస్తున్నట్టు నిన్న అధికారిగా ప్రకటన వచ్చింది. దీంతో వారి ఆశలన్నీ ఒక్కసారిగా కూలిపోయాయని చెప్పాలి. ఇప్పుడు నిర్మాతల సోషల్ మీడియా అకౌంట్ల పై అభిమానులు తెగ దాడి చేస్తున్నారు. ప్రభాస్ సినిమా వచ్చి రెండేళ్ళు దాటేసింది. ‘బాహుబలి2’ చిత్రం ఏప్రిల్ 28 2017 న విడుదలైంది. ఆ తరువాత ప్రభాస్ నుండీ ఒక్క సినిమా కూడా రాలేదు. ఈ రెండేళ్ళ సమయంలో ఎన్టీఆర్ 2, మహేష్ 3, రాంచరణ్ 2, అల్లు అర్జున్ 2.. సినిమాలు చేసేసారు.

‘సాహో’ చిత్రం మొదలైనప్పటి నుండీ.. నిర్మాతలు ప్రభాస్ అభిమానులకు ఎటువంటి అప్డేట్ ఇవ్వకుండా బాధ పెడుతూనే వున్నారు. ఇప్పుడు రిలీజ్ ఆగష్టు 30 అంటున్నారు. కానీ అది కూడా కన్ఫార్మ్ అని చెప్పలేం. సినిమా షూటింగ్ పూర్తయి పోయిందని నిన్ననే పోస్ట్ పెట్టారు. కానీ వి.ఎఫ్.ఎక్స్ వర్క్ చాలా బ్యాలన్స్ ఉండడం వలెనే ఇలా పోస్ట్ పోనే చేశామని తెలిపారు. అది నిజమనే సరిపెట్టుకోవచ్చు.. నాలుగైదు భాషల్లో రిలీజ్ ప్లాన్ చేసారు.. అన్ని భాషల్లో డబ్బింగ్ కరెక్ట్ గా వచ్చేలా చూసుకోవాలి. ఎడిటింగ్ కు కూడా చాలా సమయం పడుతుంది. వారు చెప్పినట్టు వి.ఎఫ్.ఎక్స్ పనులు కూడా అంత సులభంగా ఏమీ ముగిసిపోవు. ఏమాత్రం తేడా కొట్టినా 300 కోట్ల బడ్జెట్ బూడిదలో పోసిన పన్నీరే అయిపోతుంది. కాబట్టి రిలీజ్ కాస్త లేటైనా పర్ఫెక్ట్ గా వస్తే.. ఈ ఆలస్యానికి ఓ అర్ధం ఉంటుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus