Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movies » తెలుగు ‘మీడియా’ను ఓ ఆట ఆడేసుకుంటున్న నెటిజన్లు

తెలుగు ‘మీడియా’ను ఓ ఆట ఆడేసుకుంటున్న నెటిజన్లు

  • September 14, 2021 / 10:40 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

తెలుగు ‘మీడియా’ను ఓ ఆట ఆడేసుకుంటున్న నెటిజన్లు

ఓ పెద్ద గీతను చిన్న గీతగా మార్చాలంటే… దాని పక్కన ఇంకా పెద్ద గీత గీయాలి!

– మన పెద్దలు ఎప్పటి నుండో చెబుతున్న ఓ అనధికారిక సూత్రం ఇది. దీనిని ప్రజలు ఎంతగా పాటిస్తున్నారో తెలియదు కానీ… కొన్ని మీడియా సంస్థలు మాత్రం తమకు, తమవారికి అవసరమైనప్పుడల్లా ఇదే పని చేశాయి, చేస్తున్నాయి, చేస్తూనే ఉంటాయి. అయితే దీనికి చిన్న యాడింగ్ ఏంటి అంటే… అసలు గీత పక్కన గీసేది నిజానికి పెద్ద గీత కాదు… పెద్దది అని ప్రజల్ని నమ్మిస్తుంటారు అంతే. దీనికి తాజా ఉదాహరణ తెలంగాణలో ఇటీవల జరిగిన రెండు ఘటనలు. అవేంటో మీకు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కానీ ఫాలో కానివారికి తెలియాలి కాబట్టి చెబుతున్నాం. అవి చదివాక, మేం చెప్పింది మీకు అర్థమయ్యాక… ఆ మీడియా సంస్థలు మనల్ని మరీ కళ్లున్న కబోదుల్ని చేస్తున్నాయా? అనిపించకపోతే ఒట్టు.

ఈ నెల 10వ తేదీ ఉదయం వచ్చిన వార్త…

ఆరేళ్ల చిన్నారిని ఓ యువకుడు అతిదారుణంగా అత్యాచారం చేసి హతమార్చాడు అనే వార్త వచ్చింది. వచ్చీ రాగానే మీడియా ఈ వార్తను హైలైట్‌ చేశాయి. నగరంలో ఇలాంటి ఘటనా అంటూ ఎంత వేగంగా వార్తలు ఇచ్చాయో, మధ్యాహ్నానికి అంతే వేగంగా జోరు తగ్గించాయి.

అదే రోజు రాత్రి 9 గంటలకు వచ్చిన వార్త…

34 ఏళ్ల కుర్రాడు ఒకరు రోడ్డు మీద బైక్‌ మీద వెళ్తూ స్కిడ్‌ అయ్యి కింద పడిపోయాడు. తీవ్రంగా గాయాలయ్యాయి. అయితే అతను టాలీవుడ్‌ యువ హీరో అనేది ఇక్కడ పాయింట్‌. దీంతో ఎప్పటిలాగే మీడియా ఆ వార్తను కవర్‌ చేసింది. ఒకటి రెండు ఛానళ్లు అయితే ఆ విషయం మేం ఆ కుటుంబానికి చెప్పాం అంటూ భుజాలు చరుచుకున్నాయి కూడా.

రెండింటి ఏది ఇంపార్టెంట్‌ అంటే… వార్తగా చూస్తే రెండూ ఇంపార్టెంటే. కానీ కొన్ని తెలుగు మీడియా ఛానల్స్‌కు రెండో సంఘటన మాత్రమే ఇంపార్టెంట్‌ అనిపించిందో ఏమో. తెలుగు రాష్ట్రాల్లో ఆ యాక్సిడెంట్‌ కాకుండా ఇంకేమీ జరగలేదు అన్నట్లు వార్తలు, విశ్లేషణలు, వ్యాఖ్యలు, ఇంటర్వ్యూలు, డెమోలు, నిపుణుల అభిప్రాయాలు… ఇలా ఒక్కటేంటి జర్నలిజం ఉన్నవి, లేనివీ అన్నీ తెచ్చి హైలైట్‌ చేయడం మొదలుపెట్టారు. అయితే ఈ క్రమంలో జరిగినవి, జరగనవి అన్నీ పోగేసి చెప్పారు అనేది వేరే కాన్సెప్ట్‌. దాని గురించి తర్వాత మాట్లాడదాం.

దిల్లీలో నిర్భయ, మన దగ్గర దిశ ఘటనలు గుర్తున్నాయా? ఎందుకు మరచిపోతాం. మానవజాతి మొత్తం ఏకతాటిపై నిలిచి నిందితులకు శిక్ష పడాలి అని నినదించింది. ఆ తర్వాత కూడా ఒకటి రెండు విషయాల్లోనూ ఇలానే జరిగింది. మీడియా కూడా అంతే స్థాయిలో ఉద్యమం చేసింది. అలాంటి కొన్ని మీడియా సంస్థలకు ఆరేళ్ల చిన్నారికి జరిగిన హత్యాచారం, ఆ కుటుంబం కడుపుకోత కనిపించలేదా? కనిపించినా… ‘గజనీ’లాగా కాసేపటికి మరచిపోయిందా?

సాయిధరమ్‌ తేజ్‌ సంఘటన విషయంలో… అంతలా వెంపర్లాడిన (దేని కోసం నెటిజన్లు ఏకి పారేస్తున్నారు అనుకోండి) కొన్ని మీడియా సంస్థలు సామాన్య కుటుంబం కష్టాన్ని, ప్రజల ఆందోళనను కవర్‌ చేసే సమయం లేదా. ఎక్కడో ఆఫ్గానిస్థాన్‌లో పిల్లల పట్ల జరుగుతున్న దాడులు, పొరపాటున బండి స్కిడ్‌ అయి పడిపోయిన హీరో కనిపిస్తున్నాడు కానీ… ఆరేళ్ల చిన్నారి, ఆమె కుటుంబం కనిపించలేదా? ఈ మాటలు మేం అంటున్నవి కావు. సోషల్‌ మీడియాలో అలా ఓ లుక్‌ వేస్తే ఇలా కనిపిస్తాయి.

నెట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

టక్ జగదీష్ సినిమా రివ్యూ & రేటింగ్!
సీటీమార్ సినిమా రివ్యూ & రేటింగ్!
తలైవి సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Media
  • #people
  • #Sai Tej

Also Read

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

related news

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

trending news

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

11 hours ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

12 hours ago
Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

15 hours ago
Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

15 hours ago
‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

1 day ago

latest news

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

2 days ago
Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

2 days ago
Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Nani Premkumar: నాని చెప్పిన ఆ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీలో ఎన్టీఆర్‌ హీరోయిన్‌ నటిస్తోందా?

Nani Premkumar: నాని చెప్పిన ఆ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీలో ఎన్టీఆర్‌ హీరోయిన్‌ నటిస్తోందా?

2 days ago
Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version