విశ్వక్‌, కల్యాణ్‌రామ్‌ సినిమాల వాయిదాల వెనుక రీజన్స్‌ ఇవేనా?

అనుకున్న సమయానికి సినిమా రిలీజ్‌ అయితే పెద్ద విషయం ఏముంటుంది. సినిమా టీజర్‌ వస్తుంది, ట్రైలర్‌ వస్తుంది, ఆ తర్వాత సినిమా వస్తుంది, హిట్‌ అయితే వసూళ్ల లెక్కలు వస్తాయి, లేకపోతే ఓటీటీలోకి సినిమా వచ్చేస్తుంది. కానీ అదే సినిమా వాయిదా పడితే చాలా వార్తలు వస్తాయి. సినిమా ఎందుకు ఆలస్యం అవుతోంది, ఎందుకు వాయిదా వేస్తున్నారు అంటూ చాలా విషయాలు బయటకు వస్తాయి. తాజాగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్‌లో కనిపిస్తోంది.

కరోనా – లాక్‌డౌన్‌ పరిస్థితుల సమయంలో సినిమాలు వరుసగా వాయిదా పడేవి. అనుకున్న సమయానికి అసలు సినిమా వచ్చేది కాదు. అయితే ఇప్పుడు అలా కొన్ని సినిమాలు వాయిదా పడుతున్నాయి. ఇప్పుడు కూడా కారణాలు ఉన్నాయి. ఒక్కో సినిమాకు ఒక్కో కారణం చెబుతున్నా… ఎక్కువగా ప్రపంచకప్‌ క్రికెట్‌ అని అంటున్నారు. ప్రస్తుతం టాలీవుడ్‌లో ఇలా మూడు సినిమాలు వాయిదా పొజిషన్‌లో ఉన్నాయి. నవంబరులో ఒక్కోవారం కనీసం మూడు, నాలుగు నోటెడ్‌ సినిమాలు ఉన్నాయి అని ఈ మధ్యే అనుకున్నాం.

వాటిలో రెండు సినిమాలు వాయిదా వేసేశారు. ఇంకో సినిమా వాయిదాకు సిద్ధంగా ఉంది అంటున్నారు. వాయిదా పడిన సినిమాలు అయితే కల్యాణ్ రామ్‌ ‘డెవిల్‌’, వైష్ణవ్‌ తేజ్‌ ‘ఆదికేశవ’. ఈ సినిమానుల నవంబరు 24కు తీసుకొస్తామని చెప్పేశారు. ఇక విశ్వక్‌సేన్‌ ‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ సినిమాను వాయిదా వేస్తారు అంటున్నారు కానీ డేట్‌ చెప్పడం లేదు. ‘డెవిల్‌’ సినిమా విజువల్‌ ఎఫెక్ట్స్‌ విషయంలో టీమ్‌ సంతృప్తిగా లేకపోవడం వల్లే సినిమాను వాయిదా వేశారు అని అంటున్నారు.

ఇక ‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ (Gangs of Godavari) విషయానికొస్తే సినిమాలో ఓ పాట ఇంకా షూట్‌ చేయాలి అని అంటున్నారు. ఈ రెండు సినిమాల రీజన్లు ఇలా ఉంటే… క్రికెట్‌ మ్యాజిక్‌లో సినిమా వసూళ్లకు ఇబ్బంది ఉండకూడదు అని ‘ఆదికేశవ’ ఆగుతున్నాడట. మరి ఈ ఆలస్యం సినిమాలకు ఎంతవరకు మంచి చేస్తుంది అనేది చూడాలి. కొన్నిసార్లు వాయిదాలు మంచికే అని అంటుంటారు కదా.

‘పుష్ప’ టు ‘దేవర’.. 2 పార్టులుగా రాబోతున్న 10 సినిమాలు..!

‘సైందవ్’ తో పాటు టాలీవుడ్లో వచ్చిన ఫాదర్-డాటర్ సెంటిమెంట్ మూవీస్ లిస్ట్..!
ఆ హీరోయిన్స్ చేతిలో ఒక సినిమా కూడా లేదంట..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus