Tollywood: రెండు నెలలు.. టాలీవుడ్‌లో వరుస వాయిదాలు.. ఎందుకిలా జరుగుతోంది?

ఏ ముహూర్తాన నాగార్జున ఏ ముహూర్తాన ‘చెప్పిన డేట్‌కి మనం ఎందుకు సినిమాలు రిలీజ్‌ చేయలేకపోతున్నాం’ అని అన్నారో కానీ.. ఆ తర్వాత నుండి పెద్ద సినిమాలు దాదాపు చెప్పిన టైమ్‌కి రిలీజ్‌ అయ్యే పరిస్థితి కనిపించడం లేదు. అప్పుడెప్పుడో రావాల్సి వాయిదా పడిన సినిమాలు ఇప్పుడు వచ్చాయి కానీ.. ఇప్పటి డేట్‌ చెప్పిన సినిమాలు ఏవీ రాలేదు. అంతే కాదు సమీప భవిష్యత్తులో అంటే రాబోయే రెండు నెలల్లో రావాల్సిన సినిమాలు వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. దీంతో టాలీవుడ్‌లో మరోసారి వరుస వాయిదాలు కనిపించబోతున్నాయి.

Tollywood

వినడానికి కష్టంగానే ఉన్నా.. టాలీవుడ్‌లో ఇప్పుడు కొత్త ట్రెండ్ నడుస్తోంది. ఏ సినిమా ఎప్పుడు వస్తుందో చెప్పలేని పరిస్థితి. ఎంతో కాన్ఫిడెంట్‌గా ‘మేం చెప్పిన డేట్‌కి వచ్చేస్తాం’ అని చెప్పే సినిమాలు రావడం కాదు కదా.. కనీసం టీజర్‌లు కూడా రాని పరిస్థితి నెలకొంది. నాని – శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో రూపొందుతున్న సినిమా ‘ది ప్యారడైజ్’. మార్చి 26 నుండి ఆగస్టు 21కి అక్కడి నుండి సెప్టెంబర్ 24కు వచ్చిన ఈ సినిమా కోసం మరో రిలీజ్‌ డేట్‌ను చూస్తున్నారట. కొత్త డేట్‌ త్వరలో చెబుతారట.

వెంకటేశ్‌ – త్రివిక్రమ్‌ ‘ఆదర్శ కుటుంబం’ సినిమా అక్టోబరు 2 అని అంటున్నారు. ఇంతవరకు ఎలాంటి ప్రచారం షురూ కాలేదు. దీంతో ఆ డేట్‌పై డౌట్స్‌ వచ్చాయి. రజనీకాంత్ ‘జైలర్ 2’ విషయంలోనూ ఈ తరహా డౌట్‌ ఉన్నా.. మొన్నీమధ్యే అక్టోబరు 15 పక్కా అని ప్రకటించారు. అయితే ఇప్పటికీ ఈ విషయంలో డౌట్‌ ఉండనే ఉంది. ఇక ఆ తర్వాతి రోజు డేట్‌ చెప్పిన విజయ్ దేవరకొండ – రష్మిక మందన ‘రణ‌బాలి’ అప్పటికి రెడీ అవ్వడం కష్టమే అని చెబుతున్నారు. ఆ దగ్గర్లో కొత్త డేట్‌ని ప్రకటిస్తారు అని చెబుతున్నారు.

దీంతో టాలీవుడ్‌.. డిలేవుడ్‌ అవుతోంది అనే విమర్శలు పెరుగుతున్నాయి. ఈ విషయంలో దర్శకనిర్మాతలు ఆలోచించుకోవాల్సిందే. అన్నట్లు డిసెంబరు సినిమాల పరిస్థితి కూడా దాదాపు ఇదే అని టాక్‌.

అత్యంత పొడవైన టైటిల్‌.. చరిత్రలో తొలిసారి.. ఏంటంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus