Pushpa 2 The Rule: థియేటర్‌లో ‘పుష్ప’రాజ్‌ ఉండగా… ఈ పాటల రిలీజ్‌లేంటి మాస్టారూ..!

సినిమాకు పాటలు చాలా ముఖ్యం. అదేంటి పాటలు మాత్రమే ముఖ్యం అని అనుకుంటున్నారా? మేం అంటున్నది సినిమా ప్రచారానికి పాటలు ముఖ్యం అని. ప్రేక్షకుల్ని థియేటర్ల దగ్గరకు తీసుకురావడానికి పాటలు చాలా కీలకం. అందుకే ఒకప్పుడు ఆడియో ఫంక్షన్ పేరుతో ఈవెంట్లు పెట్టారు. ఆ తర్వాత ఆ విధానం ఆగిపోయంది. ఒక్కో పాటను విడుదల చేస్తూ ప్రచారం చేస్తున్నారు. అయితే లిరికల్‌ సాంగ్స్‌ మాత్రమే అనుకోండి. ఒక ఓటీటీల సందడి మొదలయ్యాక ఫుల్‌ సాంగ్స్‌ని ప్రచారం కోసం వాడుకోవడం స్టార్ట్‌ చేశారు.

Pushpa 2 The Rule

అంటే సినిమా ఓటీటీలోకి వస్తోంది అనగానే ఒక్కో పాట రిలీజ్‌ చేస్తూ ప్రేక్షకుల్లో సినిమాను మరోసారి ఓటీటీలో చూడాలి అనిపించే ప్రయత్నం చేస్తుంటారు. ఇప్పుడు ఇదంతా ఎందుకు అనే డౌట్‌ రావొచ్చు. ఉందీ కారణం ఉంది. దానికీ ‘పుష్ప 2’  (Pushpa 2 The Rule)  సినిమాకీ కారణం ఉంది. ఎందుకంటే సినిమాలోని ఫుల్‌ సాంగ్స్‌ను వరుస పెట్టి రిలీజ్‌ చేసేస్తున్నారు. కారణం ఏంటా అని చూస్తే.. ఆసక్తికర విషయం బయటకు వచ్చింది.

అవును, కావాలంటే మీరే చూడండి.. ‘పీలింగ్స్‌’ పాటను తొలుత రిలీజ్‌ చేస్తే.. టైటిల్‌ సాంగ్‌ను ఇప్పుడు తెచ్చేశారు. రెండింటి మధ్య గ్యాప్‌ పెద్దగా లేదు. ఇవాళో, రేపో ‘కిస్సిక్‌’ సాంగ్‌ కూడా రిలీజ్‌ చేసే అవకాశం ఉంది. మిగిలిన పాటలు కూడా వచ్చేస్తాయి అనే అంటున్నారు. జాతర పాటలు రెండూ కాస్త ఆలస్యంగా వస్తాయి అని అంటున్నారు. ఇక్కడ డౌట్‌ ఏంటంటే.. థియేటర్లలో సినిమా ఉండగా పాటలు ఇలా బయటకు ఇచ్చేయడం ఏంటి అని.

దీనికి కారణం సినిమాను డిసెంబరు 31కి నెట్‌ఫ్లిక్స్‌లోకి తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతోంది అని. సినిమా విడుదలకు అంత కంగారు ఏంటి మూడు వారాలే కద అవుతుంది అప్పటికి అనుకోవచ్చు. అయితే ఇలాంటి సినిమాకు అంతటి బెస్ట్‌ డేట్ వదిలేయడం సరికాదు అని అనుకుంటున్నారట. దీని కోసం నెట్‌ఫ్లిక్స్‌ భారీ మొత్తంలో ఇచ్చి అగ్రిమెంట్‌ చేసుకుంది అని కూడా చెబుతున్నారు. అంటే కొత్త సంవత్సరంలో ‘పుష్ప’రాజ్‌ను థియేటర్లలో చూడలేం.

ఈ వీకెండ్ కి థియేటర్/ ఓటీటీల్లో సందడి చేయబోతున్న 15 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus