ఇంకెన్నాళ్ళు రష్మీని ఒక సెక్స్ ఆబ్జెక్ట్ లా చూడాలి
- May 16, 2019 / 06:12 PM ISTByFilmy Focus
“నేను ఎలాంటి సినిమాలో అయినా నటిస్తాను.. నాకు డబ్బు ముఖ్యం” అని స్వయంగా హాట్ హీరోయిన్ టర్నడ్ ఒక టాక్ షోలో ఒప్పుకున్న విషయం తెలిసిందే. కెరీర్ తొలినాళ్లలో తాను డబ్బు లేక చాలా ఇబ్బందిపడ్డానని, అందుకే ప్రతి రూపాయి తనకు చాలా ఇంపార్టెంట్ అనీ, అందుకే క్యారెక్టర్ తో సంబంధం లేకుండా ప్రతి సినిమా చేస్తున్నానని చెప్పుకొచ్చింది రష్మీ. ఇదంతా ఒక రెండేళ్ల క్రితం జరిగిన విషయం. అప్పట్లో అమ్మడు ఇంకా సెటిల్ అవ్వలేదు కాబట్టి కొన్ని బీగ్రేడ్ సినిమాలు చేసినా ఎవరూ పట్టించుకోలేదు.
- మహర్షి సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
- మహర్షి డైలాగ్స్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
- నువ్వు తోపురావ సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
- జెర్సీ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
- చిత్రలహరి రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
కానీ.. ఇప్పుడు ఈటీవీలోనే రెండు మూడు షోస్ చేస్తుండడంతోపాటు పుష్కలంగా బయట ఈవెంట్స్ తోపాటు షోస్ కూడా చేస్తున్న రష్మీ ఇప్పటికీ ఆ బీగ్రేడ్ సినిమాలు చేస్తుండడం ఎందుకో అర్ధం కావడం లేదు. అయినా ఇప్పటికీ డైరెక్టర్లు రష్మీని ఒక సెక్స్ ఆబ్జెక్ట్ లా చూస్తుండడం, అందుకు తగ్గట్లే రష్మీ కూడా రెమ్యూనరేషన్ ఇస్తే చాలు అంటూ ఎలాంటి బోల్డ్ సీన్స్ లోనైనా యాక్ట్ చేస్తుంది. మరి ఈ పరిస్థితిలో మార్పు రావాలంటే.. రష్మీ వ్యవహారశైలిలో మార్పు రావాల్సిందే.
c












