Sudheer Babu: ‘ఆ అమ్మాయి గురించి’ ఎప్పుడు చెబుతారో?

‘ఉప్పెన’ సినిమా అందించిన విజయం తర్వాత కృతి శెట్టికి వరుస సినిమాలు వచ్చాయి. అలా ఆమె ఖాతాలో పడిన చిత్రం ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’. సుధీర్‌ బాబు హీరోగా రూపొందిన సినిమా ఇది. ఆమె ఐదో సినిమా విడుదలకు సిద్ధమవుతోంది కానీ.. ఆమె నాలుగో సినిమా ఊసు లేదు. దీంతో సుధీర్‌ బాబు ఎందుకింత సైలెంట్‌ అనే ప్రశ్న ఎదురవుతోంది. సినిమా ఇంకా పూర్తవ్వలేదేమో అని అనుకుందాం అంటే.. ప్రచారం మొదలు పెట్టి ఆపేశారు కూడా.

‘బంగార్రాజు’, ‘శ్యామ్‌ సింగరాయ్‌’ సినిమాల విజయాలతో ఊపు మీదున్న సమయంలో కృతి శెట్టి ఫేమ్‌ను క్యాష్ చేసుకునేలా ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ విడుదల చేస్తారేమో అనుకున్నారు. అనుకున్నట్లుగానే సినిమా ప్రచారాన్ని ప్రారంబించింది మైత్రీ మూవీ మేకర్స్‌. నిజానికి సినిమాకు వాళ్లు నిర్మాతలు కాదు. బెంచ్‌ మార్క్‌ స్టూడియోస్‌తో కలసి సుధీర్‌ బాబు ఈ సినిమాను నిర్మించారు. అయితే ఆఖరున వచ్చి సినిమాను భుజానికెత్తుకుంది మైత్రీ. అయితే ఏమైందో ఏమో, ప్రమోషన్స్‌ జోరును ఒక్కసారిగా ఆపేశారు.

అదిగో సినిమా అని అందరూ చూపించి, దగ్గరకు వచ్చేసరికి ఏమో చూద్దాం అనే రేంజిలో మాటలు ఆపేశారు. దీంతో ‘ఆ అమ్మాయి గురించి ఎప్పుడు చెబుతారు?’ అని ఫ్యాన్స్‌, నెటిజన్లు సోషల్‌ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. ఈ సినిమా విజయం హీరో సుధీర్‌ బాబుకి, దర్శకుడు మోహన్‌ కృష్ణ ఇంద్రగంటికి చాలా అవసరం. ఇద్దరికీ గత చిత్రాలు పరాజయాన్నే అందించాయి. ఈ నేపథ్యంలో సరైన తేదీ చూసుకొని సినిమాను విడుదల చేయాలని చూస్తున్నారట.

మైత్రీ మూవీ మేకర్స్‌ వాళ్ల రిలీజ్‌, ప్రమోషన్స్‌ ప్లానింగ్‌ పక్కాగా ఉంటుంది. ఇప్పటివరకు చాలా సినిమాలకు ఇలానే చేశారు. మరిప్పుడు ఈ సినిమా విషయంలో ఎందుకింత సైలెంట్‌గా ఉన్నారు అనేది తెలియాలి. కృతి శెట్టి – రామ్‌ నటించిన ‘వారియర్‌’ త్వరలో విడుదల కాబోతోంది. ఆ సినిమా తర్వాతైనా ఈ సినిమా తెస్తారో లేదో చూడాలి.

విరాటపర్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’, ‘అంటే..’ తో పాటు ఎక్కువ నిడివితో వచ్చిన లేటెస్ట్ సినిమాల లిస్ట్..!
‘2.0’ టు ‘విక్రమ్’ తమిళ్ లో భారీ కలెక్షన్లు రాబట్టిన 10 సినిమాల లిస్ట్..!
ఎన్టీఆర్, నాగ చైతన్య.. టు కీర్తి సురేష్, ‘గుండమ్మ కథ’ రీమేక్ కు సూట్ అయ్యే 10 మంది స్టార్లు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus