బిగ్ బాస్ సీజన్ 6లో పార్టిసిపెంట్స్ ఇప్పుడిప్పుడే మెల్లగా సెటిల్ అవుతున్నారు. రెండోవారం ఆడియన్స్ కొద్దిగా పార్టిసిపెంట్స్ కి అలవాటు పడ్డారు. ఇక ఈవారం నామినేషన్స్ లో ఉన్నవారు ఖచ్చితంగా ఎలిమినేషన్ ని ఎదుర్కోవాల్సి ఉంది. అయితే, సిసింద్రీ టాస్క్ లో నామినేషన్స్ లో ఉన్నవాళ్ల పెర్ఫామన్స్ పెద్దగా ఎక్కడా కనిపించలేదు. ముఖ్యంగా అభినయశ్రీ, ఫైమా, ఆదిరెడ్డి ఎందుకో డల్ అయ్యారని అనిపించింది. అలాగే, టాస్క్ లో చూసినట్లయితే, కెప్టెన్ బాలాదిత్య పెర్ఫామన్స్ కూడా పెద్దగా కనిపించలేదు.
సుదీపు, వాసంతీలు కూడా ఎగ్రెసివ్ గా గేమ్ ఆడలేదు. అందుకే, ఈవారం వరెస్ట్ పెర్ఫామర్ గా వీళ్లలో ఎవరు ఎంపిక అవుతారు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇక బెస్ట్ పెర్ఫామర్ గా ఖచ్చితంగా గీతు ని హౌస్ మేట్స్ ఎంచుకుంటారు. ఎందుకంటే, బేబీ బొమ్మల టాస్క్ లో తన బొమ్మని దాచిపెట్టిన తీరు, అలాగే ఎదుటి వాళ్ల బొమ్మలని చూసి తీస్కుని వాటిని లాస్ట్ అండ్ ఫౌండ్ లో పెట్టిన విధానం హౌస్ మేట్స్ కి నిద్రలేకుండా చేశాయి.
ముఖ్యంగా శ్రీసత్య, అభినయశ్రీలు గీతు ఎప్పుడెప్పుడు దొరుకుతుందా అంటూ వెయిట్ చేశారు. అందుకే, ఈవారం బెస్ట్ పెర్ఫామర్ గా గీతుని ఎంపిక చేస్కోవచ్చు. ఇక కెప్టెన్సీ టాస్క్ లో ఉన్న నలుగురు డిజె టాస్క్ లో పోటీ పడుతున్నారు. ఇప్పటి వరకూ ఇనయకి హౌసమేట్స్ నుంచీ సరైనా మద్దతు లభించలేదు. చంటి, ఆర్జే సూర్యలు కూడా వెనకబడ్డారు.
రాజ్ ఒక్కటికే రెండు ఓట్లు పడ్డాయి. అలాగే, ఇంకో ఓటు పడితే మాత్రం రాజ్ శేఖర్ ఈవారం కెప్టెన్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. కానీ, ఈవారం రాజ్ శేఖర్ ఎలిమినేషన్స్ లో డేంజర్ జోన్ లో ఉన్నాడు. ఈవారం సేఫ్ అయితే మాత్రం వచ్చేవారం కూడా రాజ్ కి ఇమ్యూనిటీ దొరికినట్లే అవుతుంది. అదీమేటర్.