నాని సినిమాలకే ఇలా జరుగుతోందా..?

నాచురల్ స్టార్ నాని గత సినిమా వీ అమెజాన్ ప్రైమ్ లో విడుదలై నెగిటివ్ టాక్ ను తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ఆ సినిమా ఫ్లాప్ కావడంతో పాటు నాని పాత్రపై కూడా విమర్శలు వ్యక్తమయ్యాయి. గతేడాది కరోనా విజృంభణ వల్ల వీ మూవీ నిర్మాత దిల్ రాజు ఆ సినిమాను తప్పనిసరి పరిస్థితుల్లో ఓటీటీలో రిలీజ్ చేశారు. నాని తరువాత సినిమా టక్ జగదీష్ ను ఈ నెల 23వ తేదీన విడుదల చేయాలని నిర్మాతలు భావించారు.

అయితే కరోనా సెకండ్ వేవ్ లో రికార్డు స్థాయిలో నమోదవుతున్న కేసుల వల్ల తప్పనిసరి పరిస్థితుల్లో ఈ సినిమాను నిర్మాతలు వాయిదా వేశారు. అయితే ఈ సినిమాకు ఓటీటీ ఆఫర్లు బాగా వస్తున్నాయని తెలుస్తోంది. శివ నిర్వాణ దర్శకత్వం వహించిన నిన్ను కోరి, మజిలీ సినిమాలు హిట్లు కావడంతో ఈ సినిమాకు భారీ మొత్తం ఇవ్వడానికి ఓటీటీలు సిద్ధమవుతున్నాయి. అయితే నాని మాత్రం ఈ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేయవద్దని నిర్మాతలకు చెబుతున్నారని తెలుస్తోంది.

వీ సినిమా గాయాన్ని నాని మరిచిపోలేదని ఆ కారణం వల్లే టక్ జగదీష్ సినిమాను థియేటర్లలో రిలీజ్ చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారని తెలుస్తోంది. మరోవైపు నాని నటిస్తున్న శ్యామ్ సింగరాయ్ మూవీ సెట్స్ పై ఉంది. ఈ సినిమాతో పాటు నజ్రియా హీరోయిన్ గా నటిస్తున్న అంటే సుందరానికి సినిమా కూడా సెట్స్ పై ఉంది. ఈ ఏడాది కనీసం మూడు సినిమాలను రిలీజ్ చేయాలని నాని భావిస్తున్నారు.

అయితే కరోనా వల్ల నాని నటిస్తున్న సినిమాల షూటింగ్ లు వాయిదా పడ్డాయి. ఈ ఏడాది నాని నటించిన సినిమాలలో ఎన్ని సినిమాలు థియేటర్లలో రిలీజవుతాయో చూడాల్సి ఉంది. నాని సినిమాల రిలీజ్ సమయంలోనే కరోనా వల్ల థియేటర్లపై ఆంక్షలు అమలవుతూ ఉండటం గమనార్హం.

Most Recommended Video

‘పవన్ కళ్యాణ్’ హీరోగా రూపొందిన 11 రీమేక్ సినిమాలు మరియు వాటి ఫలితాలు..!
పెళ్లయ్యి కూడా పెళ్లి కానట్టు ఉండే 10 మంది టాలీవుడ్ భామల లిస్ట్..!
ఈ 10 మంది టాలీవుడ్ హీరోలకి బిరుదులు మార్చిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus