ఉపాసన ఆ పేపర్ ని ఎందుకు కాల్చుతుంది ?

మెగా స్టార్ కుటుంబంలో అందరూ సినీ జీవులే. కొన్నేళ్ళక్రితం కోడలిగా అడుగు పెట్టిన ఉపాసనకి వ్యాపార రంగంలో మంచి అనుభవం ఉంది. ప్రత్యేకంగా వైద్యరంగంలో పేరుగాంచిన సంస్థను నడిపించారు. రామ్ చరణ్ ని పెళ్లాడిన తర్వాత సినీ రంగంపై కూడా అవగాహన పెంచుకున్నారు. ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ మెగా అభిమానులకు లేటెస్ట్ అప్డేట్స్ ఇస్తుంటారు. అలాగే స్ఫూర్తి దాయకమైన పోస్టులు చేస్తుంటారు. తాజాగా అలాంటి పోస్ట్ ఒకటి పెట్టారు. మనల్ని ఇబ్బంది పెట్టే ఆలోచనలను ఎలా పోగొట్టుకోవాలో వివరించారు. తాను పాటించే పద్ధతిని వీడియో రూపంలో తెలిపారు.

“కొన్ని ఆలోచనలు నన్ను చాలా ఇబ్బంది పెడుతుంటాయి. నా రోజువారీ పనులపై ప్రభావం చూపిస్తుంటాయి. అందుకే నేను రోజు చేసే పనులు సక్రమంగా జరగడానికి.. నిద్ర పోయే ముందు ఓ చిన్న పని చేస్తాను. ఈ రోజు మొత్తంలో ఏం మిస్టేక్స్ చేశాం. అలాగే బాధిస్తున్న విషయాలు ఏమిటి? అనే విషయాలను ఒక పేపర్ లో రాసుకుంటాను. ఆ తరువాత వాటిని రెండు మూడు సార్లు చదివి.. వాటికీ సమాధానం చెప్పుకొని.. ఆ పేపర్ కాల్చేస్తాను. దీంతో నా ఒత్తిడి పోతుంది. ప్రశాంతంగా నిద్రపోతాను. రేపు ఉదయం ఫ్రెష్ మైండ్ లో లేస్తాను” అని వివరించారు. ఈ విధానం చాలా మందికి నచ్చింది. అందుకే ఈ వీడియో ఎక్కువ షేర్స్ అందుకుంటోంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus