బిగ్‌బాస్‌ 4లో తొలి వైల్డ్‌ కార్డ్‌ వచ్చేశాడు!

  • September 16, 2020 / 01:48 PM IST

బిగ్‌బాస్‌లో మజాను రెట్టింపు చేసేది వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీ. షో నడుస్తున్న సమయంలో వైల్డ్‌ కార్డ్‌ అంటూ కొత్తవారిని తీసుకొస్తుంటాడు పెద్దాయన. గత మూడు సీజన్లలో వైల్డ్‌ కార్డు రూపంలో వచ్చినవారు అయితే గొడవలు పెంచారు, లేదంటే వినోదం పెంచారు. ఈసారి కూడా ఉంటుందని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే మొదటి వారమే వైల్డ్ కార్డ్ ఎంట్రీ వస్తాడని ఎవరూ ఊహించలేదు. కుమార్‌ సాయి అలియాస్‌ సాయికుమార్‌ పంపనను తొలి వైల్డ్‌ కార్డుగా బిగ్‌బాస్‌ ఈ రోజు ఇంటిలోకి పంపించాడు. కుమార్‌ సాయి అంటే గుర్తు రాలేదా… అయితే ‘ఈరోజుల్లో’ సాయి అని గుర్తుకుతెచ్చకొండి. ఆఁ… ఆయనే. నత్తి క్యారెక్టర్‌తో బాగా పాపులర్‌ అయ్యి… ఇప్పుడు ఎక్కడా కనిపించడం లేదు. వైల్డ్‌ కార్డులో బిగ్‌బాస్‌ ఇంట్లో కనిపించాడు.

తెరపైనే కాకుండా, బయట కూడా బాగా నవ్వించే సాయి… ఇంట్లో ఏం చేస్తాడో చూడాలి. ఇంట్లోకి వెళ్లేముందు కుమార్‌ సాయి స్టేజీ మీద చాలా కోరికలు కోరుకున్నాడు. ఇంట్లో నుంచి బయటకు వచ్చే సమయానికి కరోనా నుంచి ప్రపంచం బయటపడాలని కోరుకున్నాడు. దాంతోపాటు దర్శకుడు అవ్వడానికి రాసుకున్న కథను నాగార్జునకు వినిపించాలనీ కోరుకున్నాడు. చూద్దాం ఇంట్లో ఏం చేస్తాడో. ఇప్పటికే వారం రోజుల నుంచి ఇంట్లో ఉన్నవాళ్లతో కుమార్‌ సాయి ఎలా మింగిల్‌ అవుతాడో చూడాలి.

అన్నట్లు కుమార్‌ ఈ రోజు రాత్రే ఇంట్లోకి వెళ్లాడు. ఓ మూలకు వెళ్లి దుప్పటి కప్పుకొని చిన్నగా మూలుగుతున్నాడు. దానిని చూసి అందరూ భయపడి దగ్గరకొస్తున్నారు. మరి కుమార్‌సాయిని చూసి ఇంట్లోవాళ్లు భయపడ్డారా… లేక సాయినే భయపెట్టారా అనేది రేపు తెలుస్తుంది.

Most Recommended Video

ఇప్పటవరకూ ఎవరు చూడని యాంకర్ లాస్య రేర్ ఫోటో గ్యాలరీ!
సినిమాకి.. సినిమాకి మధ్య ఎక్కువ గ్యాప్ తీసుకున్న టాలీవుడ్ హీరోలు వీళ్ళే?
బిగ్‌బాస్ 4 కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus