Mythri Movie Makers: ఆ మైనస్ లేకపోతే హ్యాట్రిక్ కొట్టే ఛాన్స్ ఉండేది..!

మైత్రి మూవీ మేకర్స్… ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న బడా నిర్మాణ సంస్థల్లో ఒకటి. శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, రంగస్థలం వంటి మూడు బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్… కొట్టి స్ట్రాంగ్ బేస్ వేసుకుంది ఈ సంస్థ. రవి శంకర్, నవీన్ ఎర్నేని ఎంతో ప్యాషనెట్.. గా సినిమాలు చేస్తూ టాప్ పొజిషన్ లో దూసుకుపోతున్నారు. ఈ బ్యానర్ లో ఏ స్టార్ హీరో సినిమా చేసినా… తమ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ ను అందుకుంటూ వచ్చారు. అయితే చిన్న ,

మిడ్ రేంజ్ హీరోల సినిమాల విషయంలో మాత్రం మైత్రి వారు తడబడుతున్నారు అన్నది వాస్తవం ..! నాని, రవితేజ, విజయ్ దేవరకొండ.. వంటి హీరోలతో చేసిన సినిమాలు సక్సెస్ కాలేదు. ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే.. సినీ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా సంక్రాంతికి రెండు సినిమాలు రిలీజ్ చేసి .. ఆ రెండు సినిమాలతో హిట్లు కొట్టిన ఘనత మైత్రి వారికే చెల్లింది. జనవరి 12 న బాలకృష్ణ.. వీర సింహారెడ్డి రిలీజ్ అయ్యింది.

సూపర్ హిట్ గా నిలిచి రూ.75 కోట్ల పైనే షేర్ ను కలెక్ట్ చేసింది. ఇక జనవరి 13 న రిలీజ్ అయిన వాల్తేరు వీరయ్య చిత్రం రూ.130 కోట్లకు పైగా షేర్ ను కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అయితే ఇదే బ్యానర్ నుండీ ఫిబ్రవరి 10 న అమిగోస్ అనే చిత్రం కూడా విడుదల కాబోతోంది.

కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన ఈ మూవీ .. టీజర్, ట్రైలర్ లు బాగానే ఉన్నాయి కానీ .. ఆశించిన బజ్ ను మాత్రం క్రియేట్ చేయలేకపోయింది. ఈ మూవీ కూడా హిట్ అయ్యి బ్రేక్ ఈవెన్ అయితే కనుక నెల గ్యాప్ లో హ్యాట్రిక్ కొట్టిన ఘనత కూడా మైత్రి కే చెందుతుంది.

రైటర్‌ పద్మభూషణ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!
రెబల్స్ ఆఫ్ తుపాకుల గూడెం సినిమా రివ్యూ & రేటింగ్!

మైఖేల్ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ లో రీమిక్స్ చేసిన 20 తెలుగు పాటలు ఇవే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus