Balakrishna: బాలయ్య ఫ్యాన్స్ ఆశ నెరవేరుతుందా?

స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ ఈ మధ్య కాలంలో వరుసగా మూడు బ్లాక్ బస్టర్ హిట్లు సాధించలేదనే సంగతి తెలిసిందే. సింహా, లెజెండ్, గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాలతో బాలకృష్ణ విజయాలను సొంతం చేసుకున్నా ఆ సినిమాల తర్వాత రిలీజైన సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ అయ్యాయి. అయితే ప్రస్తుతం బాలకృష్ణ అఖండ మూవీలో నటిస్తుండగా త్వరలో అఖండ మూవీ రిలీజ్ కానుంది. రిలీజ్ కు ముందే ఈ సినిమా బ్లాక్ బస్టర్ అని బాలకృష్ణ అభిమానులు ఫిక్స్ అయ్యారు.

అఖండ సినిమా తరువాత బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో ఒక సినిమా, అనిల్ రావిపూడి డైరెక్షన్ లో మరో సినిమా తెరకెక్కనుంది. బాలయ్య వరుసగా స్టార్ డైరెక్టర్ల డైరెక్షన్ లో నటిస్తుండటంతో బాలయ్య ఖచ్చితంగా హ్యాట్రిక్ విజయాలను సొంతం చేసుకుంటారని ఫ్యాన్స్ భావిస్తున్నారు. బాలయ్య అఖండ మూవీతో కొత్త రికార్డులను క్రియేట్ చేస్తాడని అనుకుంటున్నారు. ఈ మూడు సినిమాలతో బాలయ్య ఫ్యాన్స్ ఆశ నెరవేరుతుందో లేదో చూడాల్సి ఉంది.

అఖండ మూవీ నుంచి రిలీజైన ఫస్ట్ సింగిల్ సినిమాపై అంచనాలను అమాంతం పెంచింది. అడిగా అడిగా పాటకు యూట్యూబ్ లో ఏకంగా 26 లక్షల వ్యూస్ వచ్చాయి. అఖండ మూవీ నుంచి మాస్ ఫ్యాన్స్ ను మెప్పించే సెకండ్ సింగిల్ త్వరలో రిలీజ్ కానుందని సమాచారం. అఖండపై అంచనాలు అంతకంతకూ పెరుగుతుండగా బోయపాటి శ్రీను ఆ అంచనాలను అందుకుంటారో లేదో చూడాల్సి ఉంది. మిర్యాల రవీందర్ రెడ్డి ఈ సినిమాను 70 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.

నెట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘బిగ్ బాస్5’ మానస్ గురించి ఈ 10 విషయాలు మీకు తెలుసా?
‘బిగ్ బాస్5’ లహరి షెరి గురించి ఈ 10 విషయాలు మీకు తెలుసా?
‘బిగ్ బాస్5’ ప్రియా గురించి ఈ 12 విషయాలు మీకు తెలుసా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus