Chiranjeevi: పుట్టిన రోజు నాడు ఆ విషయంపై క్లారిటీ వస్తుందా? చిరు ప్లానేంటో?

ఆ మధ్య చిరంజీవి (Chiranjeevi) ఒకేసారి చేతిలో నాలుగు సినిమాలు పెట్టుకుని.. వావ్‌ అనిపించారు. కుర్ర స్టార్‌ హీరోలే వరుస సినిమాలు చేయని ఈ రోజుల్లో చిరంజీవి అలా అంటూ అభిమానులు తెగ హడావుడి చేశారు కూడా. అయితే అందులో రెండు సినిమాలు దారుణమైన ఫలితం ఇచ్చాయి. దీంతో చిరంజీవి తన సినిమాల విషయంలో ఆలోచన మార్చినట్లున్నారు. ఒక సినిమా తర్వాత ఒక సినిమా చేస్తున్నారు. ఈ క్రమంలో ‘విశ్వంభర’ (Vishwambhara) తర్వాత ఏంటి అనే ప్రశ్న మొదలైంది.

Chiranjeevi

పై ప్రశ్నకు ఈ నెల 22న సమాధానం దొరుకుతుంది అని లేటెస్ట్‌ టాక్‌. చిరంజీవి – మల్లిడి వశిష్ట  (Mallidi Vasishta)  కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘విశ్వంభర’ సినిమా పనులు ముగింపు దశకు చేరుకున్నాయి. ఈ నేపథ్యంలోనే చిరు నెక్స్ట్‌ ప్రాజెక్ట్‌ ఏదన్నది చెప్పేయాలని టీమ్‌ అనుకుంటోందట. వారి సమాచారం ప్రకారం మోహన్‌రాజా  (Mohan Raja) దర్శకత్వంలో చిరంజీవి సినిమా చేసేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లు తెలుస్తోంది. బీవీఎస్‌ రవి (B. V. S. Ravi) కథ అందిస్తున్న కథ పనులు ముగింపు దశకు వచ్చాయట.

దర్శకుడు మోహన్‌రాజా ఇటీవల చిరంజీవిని తరచుగా వచ్చి కలుస్తున్నారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య సినిమాకు సంబంధించిన చర్చలు జరుపుతున్నారట. అందుకే ఈ నెల 22న చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా సినిమాను అనౌన్స్‌ చేస్తారు అని అంటున్నారు. సినిమా నిర్మాతగా చిరంజీవి తనయ సుస్మిత కొణిదెల (Sushmita Konidela) వ్యవహరించనున్నట్లు సమాచారం. అయితే పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీతో కలసి ఆమె ఈ సినిమా నిర్మిస్తారు అనే ప్రచారం కూడా గతంలో జరిగింది.

దీంతో ఆ విషయంలో కూడా 22న క్లారిటీ వచ్చేస్తుంది అని చెబుతున్నారు. ఇదే కాకుండా మరికొన్ని సినిమాలు చిరంజీవి దాదాపు ఓకే చేసినవి ఉన్నాయి. మరి వాటికి సంబంధించి ఏవైనా క్లూస్‌ వస్తాయేమో చూడాలి. కేఎస్‌. రామారావు (KS Rama Rao) , రాధిక(Radhika), దిల్‌ రాజు (Dil Raju) చిరంజీవితో సినిమా కోసం చాలా ఏళ్లుగా ఎదురుచూస్తున్నారు. మరి ఆ సినిమాలేమైనా ఆ రోజు అనౌన్స్‌మెంట్‌కి నోచుకుంటాయేమో చూడాలి.

మెగాస్టార్ చిరంజీవి దర్శకుల ఎంపిక విషయంలో అలా చేస్తున్నారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus