Chiranjeevi, Balakrishna: మెగాస్టార్ చిరంజీవి దర్శకుల ఎంపిక విషయంలో అలా చేస్తున్నారా?

టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన బాలకృష్ణ (Nandamuri Balakrishna) అఖండ (Akhanda) , వీరసింహారెడ్డి (Veera Simha Reddy) , భగవంత్ కేసరి (Bhagavath Kesari) సినిమాలతో భారీ విజయాలను సొంతం చేసుకోగా బాలయ్యకు హ్యాట్రిక్ విజయాలు సొంతం కావడం ఫ్యాన్స్ కు ఎంతో సంతోషాన్ని కలిగించింది. యంగ్, టాలెంటెడ్ డైరెక్టర్ల డైరెక్షన్ లో నటించడంతో పాటు నవ్యత ఉన్న కథాంశాలను ఎంచుకోవడం బాలయ్య సక్సెస్ సీక్రెట్ అని చెప్పడంలో సందేహం అవసరం లేదు. అయితే చిరంజీవి (Chiranjeevi) సైతం దర్శకుల ఎంపికలో బాలయ్యను ఫాలో అవుతున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.

Chiranjeevi, Balakrishna

ఇప్పటికే టాలెంటెడ్ డైరెక్టర్ వశిష్టకు (Mallidi Vasishta) ఛాన్స్ ఇచ్చిన చిరంజీవి గాడ్ ఫాదర్ (God Father) ఫేమ్ మోహన్ రాజా (Mohan Raja) టాలెంట్ ను నమ్మి మరో అవకాశం ఇస్తున్నారని సమాచారం అందుతోంది. మెగాస్టార్ చిరంజీవి దర్శకుల ఎంపిక విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా వార్తల్లో నిలుస్తుండటం గమనార్హం. చిరంజీవి పుట్టినరోజు కానుకగా మెగాస్టార్ భవిష్యత్తు ప్రాజెక్ట్ లకు సంబంధించి క్రేజీ అప్ డేట్స్ వచ్చే అవకాశం అయితే ఉందని చెప్పవచ్చు.

పారితోషికం విషయంలో చిరంజీవి టాప్ లో ఉండగా చిరంజీవి పారితోషికం 60 కోట్ల రూపాయలకు అటూఇటుగా ఉందని సమాచారం అందుతోంది. చిరంజీవి బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో తన కెరీర్ ను అద్భుతంగా ప్లాన్ చేసుకుంటున్నారు. చిరంజీవి మారుతున్న కాలానికి అనుగుణంగా నెక్స్ట్ లెవెల్ స్క్రిప్ట్ లను ఎంచుకుంటున్నారు. చిరంజీవి ఇతర భాషల్లో సైతం క్రేజ్ ను మరింత పెంచుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

చిరంజీవి పాన్ ఇండియా దర్శకుల డైరెక్షన్ లో సైతం నటించాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. చిరంజీవి రాబోయే రోజుల్లో సరికొత్త రికార్డులను క్రియేట్ చేయాలని అభిమానులు భావిస్తున్నారు. చిరంజీవి పుట్టినరోజు వేడుకలను అభిమానులు ఒకింత గ్రాండ్ గా జరుపుకోనున్నారని సమాచారం అందుతోంది. చిరంజీవికి క్రేజ్ అంతకంతకూ పెరుగుతుండటం కొసమెరుపు.

దళపతి విజయ్‌ గురించి మాట్లాడిన చైతు.. వీడియో వైరల్‌

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus