Jr NTR: అలాంటి రోల్ కు తారక్ మళ్లీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం సాధ్యమేనా?

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కెరీర్ పరంగా వరుస ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్నారు. ఆది, సింహాద్రి సినిమాలు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ పరంగా ఊహించని స్థాయిలో సక్సెస్ సాధించడంలో కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో తారక్ ఊరమాస్ పాత్రలలో నటించి ప్రేక్షకులను మెప్పించారు. అయితే ఈ మధ్య కాలంలో తారక్ ఇలాంటి పాత్రలో కనిపించలేదు. కొరటాల శివ మాస్ సినిమాలను తెరకెక్కించినా మాస్ ఎలిమెంట్స్ విషయంలో లిమిట్స్ లో ఉంటారు.

ఆది, సింహాద్రి తరహా మాస్ సీన్స్ తో ఈ జనరేషన్ ప్రేక్షకులకు నచ్చే అన్ని అంశాలను మిక్స్ చేసిన సినిమాలో తారక్ నటిస్తే బాగుంటుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరి తారక్ భవిష్యత్తులో ఈ తరహా ప్రాజెక్ట్ ను ఎంచుకుంటారేమో చూడాల్సి ఉంది. సినిమా సినిమాకు లుక్ విషయంలో తారక్ వేరియేషన్ చూపిస్తున్నారు. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ వైవిధ్యంతో ఉన్న కథలను ఎంపిక చేసుకుని మరిన్ని విజయాలను సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

తారక్ కు గత కొంతకాలంగా ప్రశంసలు, అవార్డులతో పాటు విజయాలు కూడా దక్కుతున్నాయి. జూనియర్ ఎన్టీఆర్ దేవర సినిమా షూట్ తో బిజీగా ఉండగా ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి 70 శాతం షూటింగ్ పూర్తైందనే సంగతి తెలిసిందే. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తన సినిమాలకు రెమ్యునరేషన్ కు బదులుగా హక్కులు, లాభాల్లో వాటా తీసుకుంటున్నారని సమాచారం అందుతోంది.

జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) కెరీర్ ను సరిగ్గా ప్లాన్ చేసుకుంటే మరిన్ని భారీ విజయాలతో పాటు సక్సెస్ రేట్ మరింత పెరగనుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్టీఆర్ సినిమాల రిలీజ్ డేట్లకు సంబంధించి త్వరలో పూర్తిస్థాయిలో క్లారిటీ రానుంది.

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రియాంక జైన్ గురించి 10 ఆసక్తికర విషయాలు..!

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ దామిని భట్ల గురించి 10 ఆసక్తికర విషయాలు!
‘బిగ్ బాస్ 7’ 14 మంది కంటెస్టెంట్స్ పారితోషికాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus