Jr NTR: ఆ కామెంట్ల గురించి తారక్ నోరు విప్పుతారా?

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్ లో జనతా గ్యారేజ్ తర్వాత మరో సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఆర్.ఆర్.ఆర్ జపాన్ ప్రమోషన్స్ లో పాల్గొన్న తారక్ అక్కడ కూడా ఎన్టీఆర్30 సినిమాకు సంబంధించి ఎలాంటి అప్ డేట్ ఇవ్వలేదు. దీపావళి పండుగ సందర్భంగా ఈ సినిమా నుంచి ఏదైనా అప్ డేట్ వస్తుందని తారక్ ఫ్యాన్స్ భావిస్తుండగా చిత్రయూనిట్ నుంచి స్పందన లేకపోవడంతో దీపావళికి కూడా ఎలాంటి అప్ డేట్ లేనట్టేనని సమాచారం అందుతోంది.

మరోవైపు ఎన్టీఆర్30 స్క్రిప్ట్ కు సంబంధించిన పనులను కొరటాల శివ ఇప్పటికే పూర్తి చేశారని సమాచారం అందుతోంది. అయితే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ కు సంబంధించిన అప్ డేట్ మాత్రం ఇప్పటివరకు రాలేదు. జూనియర్ ఎన్టీఆర్ ప్లాన్ ఏంటో అర్థం కావడం లేదని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఎన్టీఆర్30 ఆలస్యం అవుతుండటంతో ఈ సినిమా గురించి కొన్ని నెగిటివ్ కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

ఎన్టీఆర్30 గురించి పూర్తిస్థాయిలో క్లారిటీ ఎప్పుడు వస్తుందో చూడాల్సి ఉంది. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఒకే సమయంలో రెండు సినిమాలలో నటించే అవకాశం ఉందని వార్తలు ప్రచారంలోకి వస్తుండగా ఈ వార్తల గురించి అయినా తారక్ స్పందించి క్లారిటీ ఇవ్వాలని అభిమానులు కోరుకుంటున్నారు. తారక్ షూటింగ్ లకు దూరంగా ఉన్నా తారక్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ అంతకంతకూ పెరుగుతోంది.

మరోవైపు తారక్30 హీరోయిన్ కు సంబంధించి స్పష్టత రావాల్సి ఉంది. తారక్ ఒక్కో సినిమాకు ప్రస్తుతం 70 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకుంటూ ఉండగా తారక్ డిమాండ్ చేస్తే 100 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ ఇవ్వడానికి కూడా నిర్మాతలు సిద్ధంగా ఉన్నారు. తారక్ కెరీర్ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు. తారక్ బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్లను సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

జిన్నా సినిమా రివ్యూ& రేటింగ్!

Most Recommended Video

ఓరి దేవుడా సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రిన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
అత్యధిక కేంద్రాల్లో సిల్వర్ జూబ్లీ ప్రదర్శించబడిన సినిమాల లిస్ట్ ..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus