Jr NTR: బాలయ్య కామెంట్లపై యంగ్ టైగర్ ఎన్టీఆర్ స్పందించడం సాధ్యమేనా?

స్టార్ హీరో నందమూరి బాలకృష్ణకు ప్రేక్షకుల్లో ఊహించని స్థాయిలో క్రేజ్ ఉంది. భగవంత్ కేసరి సినిమాతో బాలయ్య ప్రేక్షకులకు మరోసారి ఫుల్ మీల్స్ లాంటి సినిమాను అందించడం గ్యారంటీ అని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. భగవంత్ కేసరి సినిమా ప్రమోషన్స్ విషయంలో సైతం వేగం మరింత పుంజుకుంది. త్వరలో బాలయ్య, శ్రీలీల ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొననున్నారు. మరోవైపు బాలయ్య పొలిటికల్ కార్యక్రమాలకు సంబంధించిన బాధ్యతలను దగ్గరుండి చూసుకుంటున్నారు.

అయితే చంద్రబాబు అరెస్ట్ గురించి జూనియర్ ఎన్టీఆర్ స్పందించకపోవడం గురించి బాలయ్య రియాక్ట్ అవుతూ జూనియర్ ఎన్టీఆర్ స్పందించకపోయినా ఐ డోంట్ కేర్ అంటూ చెప్పుకొచ్చారు. అయితే బాలయ్య ఐ డోంట్ కేర్ అంటూ తారక్ పై చేసిన కామెంట్ల విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జూనియర్ ఎన్టీఆర్ ఏ కారణాల వల్ల స్పందించలేదో తెలుసుకుని బాలయ్య రియాక్ట్ అయితే బాగుంటుందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

మరోవైపు బాలయ్య కామెంట్లపై యంగ్ (Jr NTR) టైగర్ ఎన్టీఆర్ స్పందించడం సాధ్యమేనా అనే చర్చ సైతం జరుగుతోంది. దేవర మూవీ రెండు భాగాలుగా తెరకెక్కుతోందని తాజాగా అధికారిక ప్రకటన వెలువడింది. ఎన్టీఆర్ సైతం మీడియా ముందు హాజరు కావడం లేదు. తనపై వస్తున్న విమర్శలు, నెగిటివ్ కామెంట్ల గురించి ఎన్టీఆర్ ఎప్పుడు స్పందిస్తారో చూడాల్సి ఉంది. జూనియర్ ఎన్టీఆర్ దేవర2 సినిమాకు సంబంధించి ప్రకటన వచ్చినా తారక్ ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సినిమాలను పూర్తి చేసిన తర్వాత మాత్రమే

ఈ సినిమా షూట్ లో పాల్గొననున్నారని తెలుస్తోంది. తారక్ తర్వాత ప్రాజెక్ట్ లపై అంచనాలు అంతకంతకూ పెరుగుతుండటం అభిమానులకు సంతోషాన్ని కలిగిస్తోంది. ఎన్టీఆర్ ప్లాన్స్ అన్నీ భారీ రేంజ్ లో ఉన్నాయని వరుసగా సినిమాలను విడుదల చేస్తూ క్రేజ్ ను రెట్టింపు చేసుకునే దిశగా తారక్ అడుగులు పడుతున్నాయని సమాచారం అందుతోంది.

స్కంద సినిమా రివ్యూ & రేటింగ్!

చంద్రముఖి 2 సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రిన్స్ యవార్ గురించి 10 ఆసక్తికర విషయాలు !

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus