Gopichand: ఆ కన్నడ దర్శకుడు గోపీచంద్ ను పాన్ ఇండియా హీరోని చేస్తాడా?

గత ఏడాది గోపీచంద్ నుండి వచ్చిన ‘పక్కా కమర్షియల్’ సినిమా నిరాశపరిచింది. అంతకు ముందు చేసిన ‘సీటీమార్’ సినిమా బాగానే ఆడినా.. దాని తర్వాత ‘ఆరడుగుల బుల్లెట్’ అనే సినిమా నామ మాత్రంగా రిలీజ్ అయ్యి డిజాస్టర్ అయ్యింది. దీంతో ఇప్పుడు గోపీచంద్ కచ్చితంగా హిట్టు కొట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. అందుకే తనకు ‘లక్ష్యం’, ‘లౌక్యం’ వంటి సూపర్ హిట్స్ ఇచ్చిన దర్శకుడు శ్రీవాస్ తో ‘రామబాణం’ అనే సినిమా చేస్తున్నాడు.

వరుస విజయాలతో ఫామ్లో ఉన్న ‘పీపుల్ మీడియా ఫ్యాక్టరీ’ వారు నిర్మాతలు కాబట్టి.. ఈ సినిమా పై మంచి అంచనాలే ఏర్పడ్డాయి. బిజినెస్ కూడా భారీగానే జరుగుతుంది. గోపీచంద్ – శ్రీవాస్ లు హ్యాట్రిక్ కొట్టే ఛాన్స్ ఉందని ఇటీవల రిలీజ్ అయిన గ్లింప్స్ తో క్లారిటీ ఇచ్చారు. ఇక దీని తర్వాత సినిమాని కూడా ప్రారంభించేశాడు గోపీచంద్.

తన కెరీర్ లో 31 వ సినిమాని కన్నడ డైరెక్టర్ ఎ.హర్ష దర్శకత్వం వహించనున్నాడు. ‘శ్రీ సత్య సాయి ఆర్ట్స్’ బ్యానర్ పై కేకే రాధామోహన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ‘కేజీఎఫ్’ చిత్రానికి సంగీతం అందించిన రవి బస్రూర్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడిగా ఎంపికయ్యారు. ‘కేజీఎఫ్ తో తెలుగు వాడైన దర్శకుడు ప్రశాంత్ నీల్ యష్ ను స్టార్ ను చేశాడు.

మరి కన్నడ వాడైన హర్ష మన తెలుగు హీరోని స్టార్ ని చేసి వేళ్తాడో లేదో చూడాలి..! గోపీచంద్ మాత్రమే కాదు రాంచరణ్ కూడా నార్తన్ అనే కన్నడ దర్శకుడితో సినిమా చేయాలని భావిస్తున్నాడు. ఇక ప్రభాస్ ఎలాగూ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ‘సలార్’ సినిమా చేస్తున్నాడు.

ఫస్ట్‌డే కోట్లాది రూపాయల కలెక్షన్స్ కొల్లగొట్టిన 10 మంది ఇండియన్ హీరోలు వీళ్లే..!
ఆరడగులు, అంతకంటే హైట్ ఉన్న 10 మంది స్టార్స్ వీళ్లే..!

స్టార్స్ కి ఫాన్స్ గా… కనిపించిన 11 మంది స్టార్లు వీళ్ళే
ట్విట్టర్ టాప్ టెన్ ట్రెండింగ్‌లో ఉన్న పదిమంది సౌత్ హీరోలు వీళ్లే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus