NTR: అలా చేస్తే మాత్రమే తారక్ నమ్మకానికి కొరటాల న్యాయం చేసిన వ్యక్తి అవుతారా?

ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్ టాలీవుడ్ క్రేజీ కాంబినేషన్లలో ఒకటి కాగా ఈ కాంబినేషన్ లో వచ్చిన జనతా గ్యారేజ్ మూవీ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఎన్టీఆర్ కెరీర్ లోని బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్లలో ఈ సినిమా ఒకటిగా నిలిచింది. అయితే ఈ కాంబినేషన్ లో ప్రస్తుతం దేవర సినిమా తెరకెక్కుతోంది. ఆచార్య సినిమా డిజాస్టర్ రిజల్ట్ వల్ల కొరటాల శివపై వచ్చిన విమర్శలు అన్నీఇన్నీ కావనే సంగతి తెలిసిందే.

అయితే ఎన్టీఆర్ కు కొరటాల శివ జీవితాంతం రుణపడి ఉండాల్సిందేనని కామెంట్లు వినిపిస్తున్నాయి. తాజాగా ఎన్టీఆర్ 30 నుంచి విడుదలైన దేవర ఫస్ట్ లుక్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. తారక్ ఈ సినిమాలో డ్యూయల్ రోల్ లో నటిస్తుండగా తండ్రి పాత్రకు సంబంధించిన పోస్టర్ తాజాగా విడుదలైంది. రాబోయే రోజుల్లో ఎన్టీఆర్ మరో రోల్ కు సంబంధించిన లుక్ కూడా రిలీజ్ కానుందని సమాచారం అందుతోంది.

అయితే ఫస్ట్ లుక్ కు మంచి రెస్పాన్స్ వచ్చిన నేపథ్యంలో సినిమాకు హిట్ టాక్ వచ్చేలా కొరటాల శివ జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది. అలా చేస్తే మాత్రమే కొరటాల తారక్ నమ్మకానికి న్యాయం చేసిన వ్యక్తి అవుతారని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తారక్ ఈ సినిమాకు 100 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకుంటుండగా కొరటాల శివ 25 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు.

ఎన్టీఆర్ (NTR) కొరటాల కాంబో మూవీ 300 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కుతోంది. ఈ సినిమా కోసం పని చేస్తున్న టెక్నీషియన్ల రెమ్యునరేషన్ 20 కోట్ల రూపాయల రేంజ్ లో ఉందని సమాచారం అందుతోంది. ఈ కాంబినేషన్ లో తెరకెక్కే సినిమా పాన్ ఇండియా స్థాయిలో సరికొత్త రికార్డులు క్రియేట్ చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఎన్టీఆర్ తర్వాత సినిమాతో సంచలనాలు సృష్టించాలని అభిమానులు భావిస్తున్నారు.

బిచ్చగాడు 2 సినిమా రివ్యూ & రేటింగ్!
డెడ్ పిక్సల్స్ వెబ్ రివ్యూ & రేటింగ్!

అన్నీ మంచి శకునములే సినిమా రివ్యూ & రేటింగ్!
పిల్లలను కనడానికి వయస్సు అడ్డుకాదంటున్న సినీతారలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus