Krithi Shetty: కృతి శెట్టి ఆ సెంటిమెంట్ ను బ్రేక్ చేస్తుందా..!

‘ఉప్పెన’ చిత్రం నుండీ మొదటి పాట విడుదలైన వెంటనే కొంతమంది కుర్రకారు ఈ చిత్రం కచ్చితంగా చూడాలని ఫిక్స్ అయ్యారు. అందుకు కారణం హీరోయిన్ కృతి శెట్టి.ఆమె లుక్స్ యువత ఎంతగానో ఆకర్షించాయి. ఆ చిత్రంలో ఓ పక్క అచ్చ తెలుగు అమ్మాయిలా కనిపిస్తూనే మరోపక్క రొమాంటిక్ సన్నివేశాల్లో కూడా అంతే ఈజ్ తో నటించింది. ఆ చిత్రం బ్లాక్ బస్టర్ అవ్వడంలో ఈమె కీలక పాత్ర పోషించిందని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.

ఆ సినిమా ఏదో ఫ్లూక్ లో హిట్ అయిపోయి ఉంటుంది అని కొంతమంది అభిప్రాయపడ్డారు. కానీ అది తప్పు అని ఇటీవల వచ్చిన ‘శ్యామ్ సింగ రాయ్’ చిత్రంతో ప్రూవ్ చేసింది కృతి. అయితే మొదటి చిత్రంలో చాలా ట్రెడిషనల్ గా కనిపించిన ఈ అమ్మడు రెండో చిత్రంలో బోల్డ్ లుక్ లో కనిపించి మరింతగా ఆకర్షించింది. అంతేకాదు కొన్ని సీన్లలో సిగరెట్లు కూడా కాలుస్తూ అందరికీ షాకిచ్చింది.

ఎలాంటి పాత్రకైనా నేను సూట్ అవ్వగలను అని ‘శ్యామ్ సింగ రాయ్’ తో ప్రూవ్ చేసింది కృతి. ఈ చిత్రం కూడా కమర్షియల్ సక్సెస్ అందుకుంది. వచ్చే నెలలో ‘బంగార్రాజు’ చిత్రంతో మరోసారి ప్రేక్షకులను పకరించనుంది కృతి శెట్టి. ఈ చిత్రంలో ఆమె నాగలక్ష్మీ అనే పల్లెటూరి అమ్మాయిగా కనిపించనుంది .’ఆర్.ఆర్.ఆర్’ ‘రాధే శ్యామ్’ వంటి పెద్ద సినిమాల హడావుడి ఉన్నప్పటికీ ‘బంగార్రాజు’ చిత్రం పై జనాలు ఫోకస్ ఉండడానికి కృతి శెట్టి కూడా ఓ కారణం అని చెప్పాలి.

ఈ సినిమాతో ఆమె కచ్చితంగా హ్యాట్రిక్ కొడుతుంది అని అంతా భావిస్తున్నారు. సంక్రాంతికి వచ్చే సినిమాలు కనుక హిట్ అయితే అందులో నటించే హీరోయిన్లకి అడ్వాంటేజ్ అవుతుంది అని కొంతమంది విశ్లేషకులు చెబుతుంటారు.ఆ సెంటిమెంట్ కనుక నిజమైతే కృతి మరింత బిజీ అవ్వడం ఖాయమనే చెప్పాలి.

శ్యామ్ సింగరాయ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

83 సినిమా రివ్యూ & రేటింగ్!
వామ్మో.. తమన్నా ఇన్ని సినిమాల్ని మిస్ చేసుకుండా..!
‘అంతం’ టు ‘సైరా’.. నిరాశపరిచిన బైలింగ్యువల్ సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus