ఈ మధ్య కాలంలో చాలామంది స్టార్ హీరోలు, స్టార్ డైరెక్టర్లు సినిమా షూటింగ్ కు ముందే రిలీజ్ డేట్ ను ప్రకటిస్తున్నారు. అయితే ఆ తేదీలకు సినిమాలు రిలీజ్ అవుతాయా అనే ప్రశ్నకు కాదనే కామెంట్లు వినిపిస్తుండటం గమనార్హం. మహేష్ బాబు నటించిన సర్కారు వారి పాట సినిమాను మొదట ఈ ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజ్ చేస్తామని ప్రకటించారు. అయితే ఆ సమయానికి ఈ సినిమా షూట్ పూర్తి కాలేదు.
ఆ తర్వాత ఏప్రిల్ లో ఈ సినిమా రిలీజ్ అవుతున్నట్టు ప్రకటించగా అప్పుడు కూడా సినిమా వాయిదా పడింది. చివరకు మే నెల 12వ తేదీన ఈ సినిమా రిలీజ్ కానుందని ప్రకటన వెలువడి ఆ తేదీకి ఈ సినిమా రిలీజ్ కావడం గమనార్హం. మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబో మూవీ వచ్చే ఏడాది పోకిరి రిలీజ్ డేట్ అయిన ఏప్రిల్ 28వ తేదీన విడుదల కానుందని ప్రకటన వెలువడింది. అయితే ఈ సినిమా షూటింగ్ నిదానంగా జరుగుతోంది.
షూటింగ్ అనుకున్న విధంగా జరగకపోవడంతో ఈ సినిమా ఆ తేదీకి రిలీజ్ కావడం కష్టమేనని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. మరి ఈ సినిమా విషయంలోనైనా రిలీజ్ డేట్ విషయంలో మహేష్ బాబు మాట మీద నిలబడతారో లేదో అని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. మహేష్ బాబు త్రివిక్రమ్ సినిమాను పూర్తి చేసి రాజమౌళి డైరెక్షన్ లో తెరకెక్కే సినిమాతో బిజీ కానున్నారు.
మహేష్ రాజమౌళి కాంబో మూవీపై భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి. త్రివిక్రమ్ మూవీని మహేష్ బాబు వీలైనంత వేగంగా పూర్తి చేయాలని ఫ్యాన్స్ సైతం కోరుకుంటున్నారు. మహేష్ బాబు త్రివిక్రమ్ సినిమాకు 70 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. మహేష్ కు త్రివిక్రమ్ కెరీర్ బెస్ట్ హిట్ ఇవ్వాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. మహేష్ కు జోడీగా ఈ సినిమాలో పూజా హెగ్డే నటిస్తున్నారు.
Most Recommended Video
ఎన్టీఆర్ – సావిత్రి టు చిరు- నయన్.. భార్యాభర్తలుగా చేసి కూడా బ్రదర్- సిస్టర్ గా చేసిన జంటలు..!
తన 44 ఏళ్ల కెరీర్లో చిరంజీవి రీమేక్ చేసిన సినిమాలు మరియు వాటి ఫలితాలు..!
సౌందర్య టు సమంత.. గర్భవతి పాత్రల్లో అలరించిన హీరోయిన్ల లిస్ట్..!