సినిమాలకు ఓపెనింగ్స్ అనేవి చాలా ముఖ్యం. మొదటి మూడు, నాలుగు రోజుల్లో భారీ వసూళ్లను రాబడితే నిర్మాతలు సేఫ్ అయినట్లే. అందుకే గట్టిగా ప్రమోషన్స్ చేసి సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతుంటారు. హీరో నాగార్జున కూడా తన ‘వైల్డ్ డాగ్’ సినిమా విషయంలో భారీ ప్రమోషన్స్ చేస్తున్నాడు. నాగ్ కి ఈ సినిమా పెద్ద సవాల్ గా మారింది. ఈ సినిమాకి కచ్చితంగా భారీ ఓపెనింగ్స్ రావాలి. ఎందుకంటే నెట్ ఫ్లిక్స్ తో పెద్ద డీల్ క్యాన్సిల్ చేసుకొని మరీ ఈ సినిమా థియేటర్లోకి వస్తుంది.
కేవలం నాగార్జున సూచనతో ఈ భారీ ఆఫర్ ని రిజెక్ట్ చేశారు నిర్మాతలు. కాబట్టి ఇప్పుడు ‘వైల్డ్ డాగ్’ను థియేటర్లలో గెలిపించుకోవాల్సిన బాధత్య నాగార్జునపై పడింది. మరి నాగ్ ఈ విషయంలో ఏ రేంజ్ లో సక్సెస్ అవుతారో చూడాలి. ఎందుకంటే ఈ మధ్యకాలంలో నాగార్జున ట్రాక్ రికార్డ్ ఏమంత బాగాలేదు. ‘వైల్డ్ డాగ్’ సినిమాకి ముందు ‘మన్మథుడు 2’, ‘ఆఫీసర్’ సినిమాల్లో నటించాడు నాగ్. ఆ సినిమాలేవీ కూడా మంచి ఓపెనింగ్స్ ను రాబట్టలేకపోయాయి.
‘ఆఫీసర్’ సినిమా అయితే డిజాస్టర్ గా నిలిచింది. ఇక నానితో కలిసి నటించిన ‘దేవదాస్’ సినిమాకి ఓపెనింగ్స్ వచ్చినప్పటికీ వాటిని ఆశించిన స్థాయిలో సినిమా సక్సెస్ కాలేదు. దీంతో ఇప్పుడు ‘వైల్డ్ డాగ్’ సినిమాకి సరైన ఓపెనింగ్స్ వస్తాయా లేదా అనే సందేహాలు కలుగుతున్నాయి. అయితే ప్రస్తుతం థియేటర్లలో ‘రంగ్ దే’ తప్ప మరో సినిమా లేకపోవడం, ‘సీటీమార్’ సినిమా పోస్ట్ ఫోన్ కావడం వంటి అంశాలు ‘వైల్డ్ డాగ్’ సినిమాకి కలిసొస్తున్నాయి. మరేం జరుగుతుందో చూడాలి!