పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సాయితేజ్ కాంబినేషన్ లో తెరకెక్కిన బ్రో మూవీకి పాజిటివ్ టాక్ వచ్చినా థియేటర్లలో మరీ భారీ రేంజ్ లో కలెక్షన్లు అయితే రాలేదు. బ్రో మూవీ రీమేక్ మూవీ కావడం, కథ, కథనం విషయంలో కొన్ని తప్పులు జరగడంతో ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించడంలో ఫెయిలైంది. సముద్రఖని కాకుండా మరొకరు డైరెక్షన్ చేసి ఉంటే ఈ సినిమా రిజల్ట్ మరింత బెటర్ గా ఉండేది.
అయితే తాజాగా ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ కు సంబంధించి అధికారికంగా ప్రకటన వెలువడింది. ప్రముఖ ఓటీటీలలో ఒకటైన నెట్ ఫ్లిక్స్ లో ఈ నెల 25వ తేదీ నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. బ్రో మూవీ ఓటీటీలో సరికొత్త రికార్డులు క్రియేట్ చేయడం ఖాయమని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. థియేటర్లలో ఈ సినిమాను చూడని వాళ్లు, వేర్వేరు కారణాల వల్ల మిస్ అయిన వాళ్లు ఓటీటీలో చూస్తే మాత్రం ఈ సినిమా సూపర్ హిట్ చేసే ఛాన్స్ అయితే ఉంది.
బ్రో సినిమా ఓటీటీలో కొత్త సీన్లు యాడ్ చేస్తే బాగుంటుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కేతిక శర్మ, ప్రియా ప్రకాశ్ వారియర్ ఈ సినిమాలో హీరోయిన్లుగా నటించగా ఈ సినిమా ఈ హీరోయిన్లకు కెరీర్ పరంగా ప్లస్ కాలేదు. ఓటీటీలో ఈ సినిమా రిలీజ్ కానుండటంతో ఫ్యాన్స్ ఎంతగానో సంతోషిస్తున్నారు. థియేటర్లలో ఈ సినిమాను చూసిన వాళ్లు ఓటీటీలో మళ్లీ చూడటానికి ఆసక్తి చూపిస్తున్నారు.
బ్రో సినిమా సరికొత్త రికార్డులను క్రియేట్ చేసి ఫ్యాన్స్ కు మరింత సంతోషాన్ని కలిగిస్తుందేమో చూడాలి. పవన్ త్వరలో రెగ్యులర్ షూటింగ్ తో బిజీ కానున్నారు. పవన్ భవిష్యత్తు ప్రాజెక్ట్ లపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. పవన్ కళ్యాణ్ సినిమాలకు 200 కోట్ల రూపాయల రేంజ్ లో బిజినెస్ జరుగుతుండటంతో ఫ్యాన్స్ సంతోషిస్తున్నారు.
మిస్టర్ ప్రెగ్నంట్ సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రేమ్ కుమార్ సినిమా రివ్యూ & రేటింగ్!
గత 10 సినిమాల నుండి రజనీకాంత్ సినిమాల థియేట్రికల్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?