Prabhas, Pawan Kalyan: బిల్లా సినిమాతో ప్రభాస్ ఆ రికార్డులను బ్రేక్ చేస్తారా?

స్టార్ హీరో ప్రభాస్ ప్రస్తుతం వరుస ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్నారనే సంగతి తెలిసిందే. ప్రభాస్ సినిమాలకు రికార్డు స్థాయిలో బిజినెస్ జరుగుతుండగా మరో మూడు నెలల్లో ప్రభాస్ నటించిన ఆదిపురుష్ మూవీ థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ నెల 23వ తేదీన ప్రభాస్ పుట్టినరోజు కావడంతో ప్రభాస్ నటించిన మూడు సినిమాలు థియేటర్లలో విడుదల కానున్నాయి. అయితే రీరిలీజ్ సినిమాల కలెక్షన్ల విషయంలో నైజాం రికార్డును ప్రభాస్ బ్రేక్ చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

ఇప్పటివరకు రీరిలీజ్ అయిన సినిమాలలో జల్సా మూవీ నైజాం ఏరియాలో కోటీ 29 లక్షల రూపాయల కలెక్షన్లను సాధించి హైయెస్ట్ రికార్డుగా నిలిచింది. ప్రభాస్ పుట్టినరోజు కానుకగా బిల్లా మూవీ థియేటర్లలో రీరిలీజ్ కానుంది. బిల్లా సినిమా 4కే ప్రింట్ లు రిలీజ్ కానుండగా ఈ సినిమా రీరిలీజ్ విషయంలో ప్రభాస్ ఫ్యాన్స్ తెగ సంతోషిస్తున్నారు. ఈ సినిమాతో పాటు ప్రభాస్ నటించిన పలు సినిమాలు థియేటర్లలో రీరిలీజ్ కానున్నాయి.

మరోవైపు ఆదిపురుష్ టీజర్ పై నెగిటివ్ కామెంట్లు వస్తున్నా ఈ సినిమా సక్సెస్ సాధిస్తుందని దర్శకుడు కాన్ఫిడెన్స్ ను కలిగి ఉండటంతో ప్రభాస్ ఫ్యాన్స్ సైతం ఈ సినిమా రిజల్ట్ విషయంలో నమ్మకాన్ని కలిగి ఉన్నారు. మరోవైపు ప్రభాస్ అత్యంత భారీ బడ్జెట్ సినిమాలైన సలార్, ప్రాజెక్ట్ కే సినిమాలలో నటిస్తున్నారు. సలార్ సినిమాకు ప్రశాంత్ నీల్ దర్శకుడు కాగా ప్రాజెక్ట్ కే సినిమాకు నాగ్ అశ్విన్ దర్శకుడు అనే సంగతి తెలిసిందే.

మరోవైపు సినిమాసినిమాకు ప్రభాస్ రెమ్యునరేషన్ పెరుగుతోంది. ప్రభాస్ ఒక్కో సినిమాకు 150 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని తెలుస్తోంది. పాన్ ఇండియా హీరోగా ప్రభాస్ కు భారీ స్థాయిలో గుర్తింపు ఉండటంతో పాటు ప్రభాస్ సినిమాల నాన్ థియేట్రికల్ హక్కులకు భారీస్థాయిలో డిమాండ్ నెలకొంది. ప్రముఖ ఓటీటీలు ప్రభాస్ సినిమాల హక్కులను కొనుగోలు చేయడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.

గాడ్ ఫాదర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ది ఘోస్ట్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కపుల్ కంటెస్టెంట్స్ రోహిత్ అండ్ మెరీనా గురించి 10 ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ శ్రీహాన్ గురించి ఆసక్తికర విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus