Devara: దేవర విషయంలో అలా జరిగితే సంచలన రికార్డ్స్ క్రియేట్ అవుతాయా?

ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతున్న ప్రతి సినిమాకు ఆ సినిమా బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా సక్సెస్ సాధించడం కీలకమనే సంగతి తెలిసిందే. పుష్ప ది రైజ్ (Pushpa) మూవీకి రికార్డ్ స్థాయిలో కలెక్షన్లు రావడానికి హిందీ వెర్షన్ కు వచ్చిన అదిరిపోయే రెస్పాన్స్ కారణమని చెప్పడంలో ఎలాంటి సందేహం అవసరం లేదు. అయితే పుష్ప1 విషయంలో జరిగిన మ్యాజిక్ దేవర (Devara) విషయంలో జరుగుతుందా అనే చర్చ సోషల్ మీడియా వేదికగా జరుగుతుండటం గమనార్హం.

Devara

దేవర హిందీ వెర్షన్ కు బుకింగ్స్ నెమ్మదిగా పుంజుకుంటున్నాయి. దేవర హిందీ వెర్షన్ ఈవినింగ్ షోలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. దేవర హిందీ వెర్షన్ రికార్డ్స్ క్రియేట్ చేస్తే సంచలన రికార్డ్స్ క్రియేట్ అవుతాయని కచ్చితంగా చెప్పవచ్చు. తాజాగా ఈ సినిమా నుంచి ఆయుధ పూజ సాంగ్ రిలీజ్ కాగా ఈ సాంగ్ థియేటర్లలో ఎలా ఉంటుందో చూడాల్సి ఉంది.

దేవర సినిమాకు సంబంధించి భారీ స్థాయిలో ప్రమోషన్స్ చేస్తుండటం ఈ సినిమాకు ఎంతగానో ప్లస్ అవుతోందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. దేవర1 సినిమాకు వచ్చే రెస్పాన్స్ ఆధారంగా దేవర సీక్వెల్ విషయంలో నిర్ణయం తీసుకోనున్నారు. దేవర సినిమా టికెట్ రేట్లు ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా ఉండగా బెనిఫిట్ షోల టికెట్ రేట్లు పెంచి అమ్మిన వాళ్ల విషయంలో అధికారులు కఠినంగా వ్యవహరిస్తున్నారు.

దేవర1 మూవీ రేంజ్ ఏంటో మరికొన్ని గంటల్లో తేలిపోనుంది. ఈ సినిమా బిజినెస్ వ్యవహారాలకు దూరంగా ఉండాలని కొరటాల శివ ఫిక్స్ అయ్యారని తెలుస్తోంది. రాజమౌళి సెంటిమెంట్ బ్రేక్ అవుతుందో లేదో మరికొన్ని గంటల్లో తేలిపోనుంది. వరుస సినిమాలతో బిజీగా ఉన్న జక్కన్న సైతం ఈ సినిమా సెంటిమెంట్ ను బ్రేక్ చేస్తుందో లేదో అని ఒకింత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని తెలుస్తోంది.

జగపతి బాబు బ్రేక్ ఫాస్ట్ మెనూ చూస్తే వికారం రావడం గ్యారంటీ.. వీడియో వైరల్.!

 

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus