Yash, Prabhas: సలార్ మూవీ కేజీఎఫ్ రికార్డ్స్ ను సులువుగా బ్రేక్ చేస్తుందా?

స్టార్ హీరో ప్రభాస్ కు ప్రస్తుతం కచ్చితంగా ఒక హిట్ కావాలనే సంగతి తెలిసిందే. సలార్ సినిమా రిలీజ్ కు 250 రోజుల సమయం ఉండగా ఈ సినిమాకు సంబంధించిన అప్ డేట్స్ వస్తే బాగుంటుందని ఫ్యాన్స్ భావిస్తున్న సంగతి తెలిసిందే. కేజీఎఫ్, కేజీఎఫ్2 సినిమాలు క్రియేట్ చేసిన రికార్డులను సలార్ బ్రేక్ చేస్తే బాగుంటుందని కొంతమంది భావిస్తున్నారు. సలార్ మూవీ ఏకంగా 300 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తం బడ్జెట్ తో తెరకెక్కుతోంది.

ప్రశాంత్ నీల్ ఈ సినిమాలో ఎలివేషన్ సీన్లు ఎక్కువగా ఉండేలా ప్లాన్ చేసుకున్నారని తెలుస్తోంది. ప్రభాస్, శృతి కాంబినేషన్ లో వచ్చే సీన్లు బాగుంటాయని సమాచారం. సలార్ మూవీ సెప్టెంబర్ నెల 28వ తేదీన థియేటర్లలో రిలీజ్ కానుంది. పాన్ ఇండియా సినిమాగా ఈ సినిమా రిలీజ్ కానుండగా ఐదు భాషల్లో ఈ సినిమా రిలీజ్ కానుంది. హిందీ ప్రేక్షకులు సైతం ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా ప్రభాస్ ఇమేజ్ ను రెట్టింపు చూస్తుందని కామెంట్లు వినిపిస్తున్నాయి.

అయితే సలార్ మూవీ ఒక పార్ట్ గా రిలీజ్ కానుందో లేక రెండు భాగాలుగా రిలీజ్ కానుందో రిలీజ్ కానుంది. రికార్డ్ స్థాయిలో ఈ సినిమాకు బిజినెస్ ఆఫర్లు వస్తుండగా ఈ సినిమా మేకర్స్ కు సినిమా రిలీజ్ కు ముందే భారీ లాభాలను అందిస్తోంది. ప్రభాస్ ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. శృతి హాసన్ సీన్లు ఈ సినిమాలో ఎమోషనల్ గా ఉండనున్నాయని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తుండటం గమనార్హం.

ఈ సినిమాలో హాలీవుడ్ లెవెల్ లో యాక్షన్ సీక్వెన్స్ లు ఉంటాయని సమాచారం అందుతోంది. హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ లో ఈ సినిమా తెరకెక్కనుందని తెలుస్తోంది. హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ లో తెరకెక్కిన సినిమాలలో ఎక్కువ సినిమాలు అంచనాలకు మించి విజయం సాధించాయి.

వీరసింహారెడ్డి సినిమా రివ్యూ & రేటింగ్!
వాల్తేరు వీరయ్య సినిమా రివ్యూ & రేటింగ్!

‘ఆంధ్రావాలా’ టు ‘అజ్ఞాతవాసి’ .. సంక్రాంతి సీజన్లో మర్చిపోలేని డిజాస్టర్ గా సినిమాల లిస్ట్..!
తలా Vs దళపతి : తగ్గేదేలే సినిమా యుద్ధం – ఎవరిది పై చేయి?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus