‘సరిలేరు నీకెవ్వరు’ టీజర్ తో ఆ విషయంలో క్లారిటీ వస్తుందా..?

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న తాజా చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. అనిల్ రావిపూడి డైరెక్షన్లో తెరకెక్కుతోన్న ఈ చిత్రం 2020 సంక్రాంతి కానుకగా విడుదల కాబోతుంది. అయితే ఈ చిత్రాన్ని మొదట జనవరి 12న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. కానీ అదే డేట్ కు అల్లు అర్జున్, త్రివిక్రమ్ ల ‘అల వైకుంఠపురములో’ చిత్రాన్ని కూడా విడుదల చేస్తున్నట్టు ఆ చిత్ర నిర్మాతలు ‘హారిక అండ్ హాసిని క్రియేషన్స్’ వారు కూడా చెప్పుకొచ్చారు. దీంతో ఈ రెండు చిత్రాలు కొనుగోలు చేసే బయ్యర్స్ టెన్షన్ పడుతూ నిర్మాతలకు ఫోన్ చేసారని తెలుస్తుంది.

ఈ విషయమై ‘సరిలేరు నీకెవ్వరు’ నిర్మాతలలో ఒకరైన దిల్ రాజు.. ‘అల వైకుంఠపురములో’ టీంతో మీటింగ్ పెట్టి ఓ అండర్స్టాండింగ్ కు వచ్చినట్టు కూడా ఫిలింనగర్లో టాక్ వినిపిస్తుంది. వారి సమాచారం ప్రకారం ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రం ఒకరోజు ముందు అంటే జనవరి 12న విడుదల కాబోతున్నట్టు వార్తలు వచ్చాయి. అయితే ఈ విషయాన్ని ఇంకా నిర్మాతలు ప్రకటించలేదు. నవంబర్ 22 న టీజర్ విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. కాబట్టి ఆ టీజర్ ద్వారా జనవరి 11న విడుదల చేస్తున్నట్టు ప్రకటిస్తారా… అనేది చూడాల్సి ఉంది. ఇక ఈ టీజర్ కోసం మహేష్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

తెనాలి రామకృష్ణ బిఏ బిఎల్ సినిమా రివ్యూ & రేటింగ్!
యాక్షన్ సినిమా రివ్యూ & రేటింగ్!
తిప్పరామీసం సినిమా రివ్యూ & రేటింగ్!
ఏడు చేపల కథ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus