Surender Reddy: సురేందర్‌ రెడ్డి అంత డేరింగ్‌ స్టెప్‌ వేస్తాడా?

‘సైరా’ తర్వాత సురేందర్‌ రెడ్డి సినిమా ఏంటి? చాలా రోజుల నలిగిన ఈ ప్రశ్న.. ఆ మధ్య రెండు సినిమా అనౌన్స్‌మెంట్‌తో ఆగిపోయింది. పవన్‌ కల్యాణ్‌తో ఓ సినిమా, అఖిల్‌తో ఓ సినిమా అంటూ వార్తలొచ్చాయి. అయితే ఇప్పుడు ఈ రెండింటిలో ఒకటే మిగలనుందా? ప్రస్తుతం టాలీవుడ్‌ టాక్స్‌ వింటుంటే ఇదే అర్థమవుతోంది. అయితే సురేందర్‌ రెడ్డి వదిలేస్తారు అంటున్న సినిమా పవన్‌ది కావడం ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది. మరి సూరి అలానే అనుకుంటున్నారా? అనేది తెలియడం లేదు.

సురేందర్‌ రెడ్డి – వక్కంతం వంశీ కాంబినేషన్‌లో వచ్చిన సినిమాలు చాలా వరకు హిట్టే. ఇప్పుడు పవన్‌ కల్యాణ్‌తో రామ్‌ తాళ్లూరి నిర్మిస్తున్న సినిమాకు ఈ కాంబోనే పని చేస్తోందంటూ ఇటీవల ప్రకటించారు. అంతకుముందే అఖిల్‌తో ఓ సినిమా ఉంటుందని అనౌన్స్‌మెంట్‌ వచ్చింది. అయితే డేట్స్‌, టైమ్‌ తదితర సమస్యల కారణంగా సూరి ఒక్క సినిమానే చేస్తున్నాడని వార్తలొస్తున్నాయి. ప్రస్తుతం పవన్‌ ఉన్న స్పీడు చూస్తుంటే సూరి సినిమా స్టార్ట్‌ అవ్వడానికి ఇంత త్వరగా వీలయ్యేలా లేదు.

ముందుగా అనుకున్న ప్రకారం ఈ ఏడాది మేలో సురేందర్‌ రెడ్డి సినిమా స్టార్ట్‌ అవ్వాలి. ఈ సినిమా పూర్తి చేసి అఖిల్‌ సినిమా చేద్దామని సూరి అనుకున్నారట. కానీ కరోనా పరిస్థితులు, సినిమా వాయిదాల కారణంగా పవన్‌ సినిమా ఆలస్యమయ్యే పరిస్థితి వచ్చింది. కారణం ఇంకా పవన్‌ ‘అయ్యప్పన్‌ కొషియమ్‌’, ‘హరి హర వీరమల్లు’ చిత్రీకరణ ఇంకా పూర్తి చేసుకోలేదు. దీంతో ఇప్పుడే అఖిల్‌ సినిమా స్టార్ట్‌ చేద్దామని సూరి అనుకుంటున్నారట. దీంతో పవన్‌ సినిమా వదిలేస్తాడని వార్తలొస్తున్నాయి. అయితే అఖిల్‌ సినిమా అయ్యాక పవన్‌ సినిమా చేస్తాడనే మాటలూ వినిపిస్తున్నాయి.

Most Recommended Video

రంగ్ దే సినిమా రివ్యూ & రేటింగ్!
అరణ్య సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 10 మంది హీరోయిన్లు టీనేజ్లోనే ఎంట్రీ ఇచ్చేసారు తెలుసా..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus