Thaman: వెండితెరపై భారీ తుపానుకు సిద్ధంగా ఉండండి.. తమన్‌ పోస్టు వైరల్‌

‘ఓజీ’ (OG Movie) సినిమా ఎప్పుడు వస్తుందో తెలియదు కానీ.. వచ్చేటప్పుడు మాత్రం రికార్డు బ్రేక్‌లు, వసూళ్ల లెక్కలు మామూలుగా ఉండవు అంటూ.. చాలా రోజులుగా ఆ సినిమాకు పని చేస్తున్న వాళ్లు చెబుతూనే ఉన్నారు. దీంతో సెట్స్‌ మీద సినిమా ఉన్నా లేకపోయినా మీద అంచనాలు మాత్రం అదిరిపోయే రేంజిలో ఉంటాయి. తాజాగా ఆ అంచనాలను మరోసారి గుర్తు చేస్తూ.. సినిమా సంగీత దర్శకుడు తమన్‌ (S.S.Thaman)  ఓ పోస్ట్‌ చేశారు. ‘‘ఓజీ’ సినిమా నుండి ఇప్పటికే ఓ టీజర్‌ వచ్చిన విషయం తెలిసిందే.

Thaman

ఆ టీజర్‌ను ఇటీవల ఓ కాలేజీలో జరిగిన కార్యక్రమంలో ప్రదర్శించారు. దానికి సంబంధించిన వీడియోను ఓ నెటిజన్‌ ట్వీట్‌ చేస్తూ ‘ఓజీ’ టీజర్‌కు వస్తున్న రెస్పాన్స్‌ ఎప్పటికీ పాతబడదు. తమన్‌ (Thaman) , సుజీత్‌ (Sujeeth)  కలసి ట్రీట్‌ ఇవ్వడానికి సిద్ధమవుతున్నారు. మీరు కూడా రెడీగా ఉండండి. అంటూ సెప్టెంబరు 2 తేదీని మెన్షన్‌ చేశారు. ఆ ట్వీట్‌కు తమన్‌ రిప్లై ఇచ్చారు. ఇప్పుడు సమాధానమే సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

వెండితెర మీద భారీ తుపాను వచ్చేముందు ప్రశాంతత ఇది. త్వరలో అదరగొడతాం అని రాసుకొచ్చారు. ఒరిజినల్‌ గ్యాంగ్ స్టర్‌ అంటూ ప్రత్యేకంగా రాసుకొచ్చిన తమన్‌.. ‘కలుద్దాం త్వరలో’ అంటూ రాసుకొచ్చారు తమన్‌. ఈ నేపథ్యంలో సెప్టెంబరు 2న ‘ఓజీ’ నుండి స్పెషల్‌ ట్రీట్‌ పక్కా అని అభిమానులు ఆశిస్తున్నారు. పవన్ కళ్యాణ్  (Pawan Kalyan)  రీసెంట్‌ మూడు సినిమాలు ‘వకీల్ సాబ్’ (Vakeel Saab) , ‘భీమ్లా నాయక్’ (Bheemla Nayak) , ‘బ్రో’ (BRO) సినిమాలకు తమనే సంగీతం అందించారు.

ఇప్పుడు ‘ఓజీ’కి కూడా ఆయనే సంగీతం అందిస్తున్నారు. ఆ మూడు సినిమాల్లో సంగీతానికి మంచి స్పందన వచ్చింది. మరిప్పుడు ఈ సినిమాకు ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి. ఈ సినిమా కోసం తన దగ్గర స్పెషల్‌ టీమ్‌ వర్క్‌ చేస్తోందని ఇప్పటికే తమన్‌ తెలిపారు. మిగిలిన సినిమాల టీమ్‌కు, ఈ సినిమాకు సంబంధం ఉండదని తెలిపారు. మరి ఆ స్పెషల్‌ వర్క్‌ ఏంటో చూడాలి.

అడ్వాన్స్ బుకింగ్స్ తో రికార్డు కొట్టిన ‘ఇంద్ర’

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus