Indra Movie: అడ్వాన్స్ బుకింగ్స్ తో రికార్డు కొట్టిన ‘ఇంద్ర’

మెగాస్టార్ చిరంజీవి  (Chiranjeevi)   పుట్టినరోజు అంటే మెగా అభిమానులకు అదో పండగ రోజు లాంటిది. అదే రోజున ఆయన కెరీర్లో ఇండస్ట్రీ హిట్ అయిన సినిమా రీ రిలీజ్ అవుతుంది అంటే.. ఇక అభిమానులను ఆపడం ఎవ్వరి తరం కాదనే చెప్పాలి. అందుకు రీ రిలీజ్ అవుతున్న ‘ఇంద్ర’ (Indra)  ని బెస్ట్ ఎగ్జాంపుల్..గా చెప్పుకోవాలి. 2002 జూలై 24న రిలీజ్ అయిన ‘ఇంద్ర’ ఓ సంచలనం. అప్పటివరకు ఉన్న రికార్డులన్నింటినీ తుడిచి పెట్టేసింది ‘ఇంద్ర’. 1

Indra Movie

22 కేంద్రాల్లో 100 రోజులు, 35 కేంద్రాల్లో 175 రోజులు ఆడిన ‘ఇంద్ర’ సినిమా.. బాక్సాఫీస్ వద్ద రూ.50 కోట్లు గ్రాస్ ను కొల్లగొట్టిన మొదటి తెలుగు సినిమాగా రికార్డులు క్రియేట్ చేసింది. షేర్ పరంగా రూ.28 కోట్లు కొల్లగొట్టింది. ఇక ఈ మధ్యనే అంటే 2024 జూలై 24 కి ‘ఇంద్ర’ రిలీజ్ అయ్యి 22 ఏళ్ళు పూర్తయ్యింది. ఇక ఆగస్టు 22న మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు ఉండటంతో.. ‘ఇంద్ర’ ని 4K కి డిజిటలైజ్ చేసి..

రీ రిలీజ్ చేస్తుంది ‘వైజయంతి మూవీస్’ సంస్థ. ఈ మధ్యనే అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చేయడం జరిగింది. కేవలం అడ్వాన్స్ బుకింగ్స్ రూపంలోనే రూ.1.7 కోట్ల గ్రాస్ ను కొల్లగొట్టింది ‘ఇంద్ర’ చిత్రం. ఇంకా షోలు పెంచుతూనే ఉన్నారు. దాదాపు అన్ని చోట్ల మంచి బుకింగ్స్ జరిగాయి. చూస్తుంటే రీ రిలీజ్ లో కూడా ఇండస్ట్రీ రికార్డు కొట్టేలా కనిపిస్తుంది ‘ఇంద్ర’ చిత్రం.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus