మేనల్లుడి రీమిక్స్ సెంటిమెంట్!

కొందరికి హీరోయిన్ సెంటిమెంట్ ఉంటుంది, ఇంకొందరికి మ్యూజిక్ డైరెక్టర్, మరికొందరికి లొకేషన్ ఇలా చాలా రకాల సెంటిమెంట్స్ ఉంటాయి. కానీ.. మెగాహీరో సాయిధరమ్ తేజ్ కి మాత్రం విచిత్రంగా రీమిక్స్ సాంగ్ సెంటిమెంట్ కాస్త గట్టిగా పట్టుకొంది. ఇప్పటివరకూ సాయిధరమ్ తేజ్ హిట్ సినిమాలను ఒక్కసారి పరిశీలిస్తే అందులో తప్పకుండా చిరంజీవి క్లాసిక్ హిట్స్ లోని ఒక సాంగ్ రీమిక్స్ తప్పకుండా ఉండి తీరుతుంది. సాయిధరమ్ తేజ్ ఆఖరి హిట్ అయిన “సుప్రీమ్” సినిమాలోనూ “అందం హిందోళం: పాటను రీమిక్స్ చేశాడు సాయిధరమ్. ఆ తర్వాత వచ్చిన “తిక్క, విన్నర్, నక్షత్రం, జవాన్” చిత్రాల్లో చిరంజీవి సాంగ్స్ ను రీమిక్స్ చేయలేదు. కథ-కథనాలు బాగోక ఫ్లాపైన సదరు సినిమాల మీద ఈ సాంగ్ సెంటిమెంట్ ఎఫెక్ట్ కూడా ఉందని చెప్పుకొంటుంటారు మెగాభిమానులు.

అందుకే తాజాగా వినాయక్ దర్శకత్వంలో నటిస్తున్న “ఇంటిలిజెంట్” సినిమా కోసం చిరంజీవి సూపర్ హిట్ సాంగ్స్ లో ఒకటైన “చమక్ చమక్ చమ్” పాటను రీమిక్స్ చేశాడు. తమన్ సంగీత సారధ్యంలో రూపొందిన ఈ పాట అవుట్ పుట్ ఆశించిన స్థాయిలో రాకపోయినా వినాయక్ స్టైల్ విజువల్స్ మాత్రం అలరించే విధంగా ఉన్నాయి. మరి ఈ రీమిక్స్ సెంటిమెంట్ ఫలించి “ఇంటిలిజెంట్” సూపర్ హిట్ అవుతుందో లేదో చూడాలి.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus