ఏప్రిల్ నెల టాలీవుడ్ కు (Tollywood) ఆశించిన విధంగా స్టార్ట్ కాలేదు. ఇప్పటివరకు విడుదలైన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద నిరాశ కలిగించాయి. ముఖ్యంగా సిద్ధూ జొన్నలగడ్డ (Siddu Jonnalagadda) నటించిన ‘జాక్'(Jack) సినిమాపై భారీ అంచనాలు ఉన్నా, ఆ సినిమాకు మిక్స్‌డ్ టాక్ వచ్చి రెండో రోజుకే కలెక్షన్లు పడిపోయాయి. దీంతో ఏప్రిల్ హిట్ లేకుండానే ముగుస్తుందా అనే సందేహం మొదలైంది. కానీ ఈ వారం టాలీవుడ్ ప్రేక్షకుల ముందుకు మూడు ఆసక్తికరమైన సినిమాలు రాబోతున్నాయి.
తమన్నా (Tamannaah Bhatia) ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘ఓదెల 2’ (Odela 2) సినిమా ఈ వారంలో విడుదల కానుంది. ‘ఓదెల రైల్వే స్టేషన్’కు (Odela Railway Station) సీక్వెల్ గా వస్తున్న ఈ సినిమా మైథలాజికల్ హారర్ నేపథ్యంలో రూపొందింది. సంపత్ నంది (Sampath Nandi) నిర్మాతగా, రైటర్ గా వ్యవహరించగా, దర్శకత్వ బాధ్యతలు అశోక్ తేజ (Ashok Teja) అందించారు. ఇప్పటికే టీజర్, ట్రైలర్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. తమన్నా ఈ సినిమాతో మాస్ ఆడియన్స్‌ను ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి.
ఇక అదే రోజున విడుదల అవుతున్న మరో సినిమా ‘అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి’ (Arjun Son Of Vyjayanthi) . నందమూరి కళ్యాణ్ రామ్ (Nandamuri Kalyan Ram) హీరోగా, ప్రదీప్ చిలుకూరి (Pradeep Chilukuri) దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో లేడీ అమితాబ్ విజయశాంతి (Vijaya Shanthi) ఒక పవర్‌ఫుల్ పోలీస్ పాత్రలో కనిపించనున్నారు. మదర్ సెంటిమెంట్‌తో పాటు యాక్షన్ డ్రామా మిక్స్‌గా రూపొందిన ఈ సినిమా ట్రైలర్ ఇప్పటికే బజ్ క్రియేట్ చేసింది. కళ్యాణ్ రామ్‌కు ఇది హిట్ కావాలన్న అంచనాలు అభిమానుల్లో ఉన్నాయి.
అలాగే మాస్ మహారాజా రవితేజకు (Ravi Teja) ఎంతో ప్రత్యేకమైన మూవీ ‘నా ఆటోగ్రాఫ్’ (Naa Autograph) మళ్లీ థియేటర్లలోకి రాబోతోంది. ఎమోషనల్ డ్రామా, మ్యూజికల్ క్లాసిక్‌గా నిలిచిన ఈ సినిమాకు ఎంఎం కీరవాణి (M. M. Keeravani) సంగీతం ప్రధాన హైలైట్. నోస్టాలిజిక్ ఫీలింగ్ కోరుకునే ప్రేక్షకులకు ఇది మంచి ట్రీట్ అవుతుంది. ఈ మూడు సినిమాలు ఏప్రిల్ 18న విడుదలవుతున్న నేపథ్యంలో, ఈ వారమే టాలీవుడ్‌కు (Tollywood) ఫస్ట్ హిట్ రాబోతుందా అన్నది ఆసక్తికరంగా మారింది. మరి ఏ సినిమా ప్రేక్షకుల హృదయాలు గెలుచుకుంటుందో వేచి చూడాలి.