Nani: ఆ రోజు కాస్త జాగ్రత్తగా ఉండండి: నాని స్వీట్‌ వార్నింగ్!

నాని (Nani)  సినిమా అంటే ఓ లెక్క ఉంటుంది ఫ్యాన్స్‌కి. ఇక్కడ లెక్క అంటే మినిమమ్‌ ఎక్స్‌పెక్టేషన్స్‌ అని అర్థం. ఒక్కోసారి ఆ లెక్క జనాలకు చుక్కలు చూపిస్తుంది అనుకోండి. అంటే సినిమా తేడొకొడుతుంది అని. అయితే ఇది చాలా సార్లు తక్కువ. దీనంతటికి కారణం నాని ఒకే మీటర్‌లో సినిమాలు చేసుకుంటూ రావడం. అయితే రీసెంట్‌గా నాని స్టైల్‌ మార్చాడు. ఫ్యామిలీ హీరో అనే ట్యాగ్‌ అనుకోకుండా వచ్చేయడంతో.. ఇప్పుడు మాస్‌ టచ్‌ కోసం మారిపోయాడు. అలా చేసిన ఓ సినిమా ‘హిట్‌ 3’(HIT 3) .

Nani

ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో ట్రైలర్‌ లాంచ్‌ చేశారు. ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ చేసిన కొన్ని కామెంట్స్‌ ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. నాని కథానాయకుడిగా శైలేశ్‌ కొలను  (Sailesh Kolanu) దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘హిట్‌: ది థర్డ్‌ కేస్‌’. ఈ సినిమా ట్రైలర్‌ లాంచ్‌కి విశాఖపట్నం వచ్చిన నాని.. ఆ నగరంతో తనకు ఉన్న అనుబంధం గురించి మాట్లాడాడు. అలాగే సినిమా విషయంలో కొంతమంది ఆ రోజు ఆలోచన మార్చుకోవాలి అని కూడా అన్నాడు.

15 ఏళ్ల క్రితం నా పెళ్లికి ముందు ఒక అమ్మాయిని కలవడానికి తరచూ విశాఖపట్నం వచ్చేవాడిని. ఆ తర్వాత ఆమెనే పెళ్లి చేసుకున్నా. గత 15 ఏళ్ల నుండి మిమ్మల్ని కలవడానికి వస్తున్నాను. అప్పుడు వచ్చిందీ ప్రేమ కోసమే.. ఇప్పుడు వస్తోందీ ప్రేమ కోసమే. అప్పుడు ఆమె ప్రేమ.. ఇప్పుడు ప్రేక్షకుల ప్రేమ అని తన అభిమానాన్ని వెలిబుచ్చాడు. వేరే ఊళ్లకు వెళ్తే నన్ను అన్న లేదా తమ్ముడిలా చూస్తారు. కానీ వైజాగ్‌ వాళ్లు నన్ను అల్లుడిలాగే చూస్తారు అని అన్నాడు నాని.

నాని యాక్షన్‌ సినిమాలు చేయాలని కోరుకునే వారంతా మే ఒకటో తేదీ థియేటర్లకు వచ్చేయండి. లవ్‌ స్టోరీలు, ఫీల్‌ గుడ్‌, ఫన్‌ సినిమాలు నాని చేయాలి అను అనుకునేవారు ఆ రోజు కాస్త జాగ్రత్తగా ఉండండి అని స్వీట్‌ వార్నింగ్‌ ఇచ్చాడు. అలా తన పాత్రలో రాబోయే మార్పు గురించి చెప్పేశాడు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus